Begin typing your search above and press return to search.

వైట్ అండ్ వైట్ ప్యాంట్ షూట్ లో నుష్రత్ భరూచా!

By:  Tupaki Desk   |   31 July 2022 12:30 AM GMT
వైట్ అండ్ వైట్ ప్యాంట్ షూట్ లో నుష్రత్ భరూచా!
X
బాలీవుడ్ బ్యూటీ నుష్రత్ భరూచా టాలీవుడ్ కి సుప‌రిచియ‌తే. ప‌దేళ్ల క్రితం శివాజీ హీరోగా న‌టించిన 'తాజ్ మ‌హ‌ల్' సినిమాతో అమ్మ‌డు ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ సినిమా ఆశించిన స్థాయిలో రాణించ‌లేదు. దీంతో నుష్రత్ తెలుగింట పెద్ద‌గా ఫేమ‌స్ కాలేక‌పోయింది. అదే మొద‌టి సినిమా..అదే చివ‌రి సినిమాగాను నిలిచింది. ఆ త‌ర్వాత త‌మిళ‌..హిందీ భాష‌ల్లో కొన్ని సినిమాలు చేసింది.

కానీ ఏ భాష‌లోనూ పెద్ద‌గా స‌క్సెస్ కాలేదు. అయితే న‌టిగా ఖాళీగా మాత్రం ఏనాడు లేదు. ఏదో ఒక సినిమాతో మెప్పించే ప్ర‌య‌త్నం చేస్తూనే ఉంది. అమ్మ‌డి అందం..అభిన‌యంతోనే అదంతా సాధ్య‌మ‌వుతుంది. ఇప్పుడిప్పుడే అవకాశాలు కూడా పెరుగుత‌న్నాయి. ఈ ఏడాది మూడు సినిమాలతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.

ఇప్ప‌టివ‌ర‌కూ ఏడాదికి ఒక సినిమా చొప్పు చేసిన బ్యూటీ ఒకేసారి మూడు సినిమాలు చేయ‌డం ఇదే తొలిసారి. అలాగే 'సెల్ఫీ' అనే మ‌రో సినిమాలో కూడా న‌టిస్తుంది. ప్ర‌స్తుతం ఆ సినిమా షూటింగ్ ద‌శ‌లో ఉంది.

వ‌చ్చే ఏడాది ఆసినిమా ప్రేక్ష‌కుల ముందుకురానుంది. మ‌రి ఈ అవ‌కాశాల వెనుక మాయాజాలం ఏదైనా ఉందా? అంటే సోష‌ల్ మీడియాలో ఉన్న క్రేజ్ కొంత వ‌ర‌కూ కార‌ణం అని చె ప్పొచ్చు.

బ్యూటీ నిత్యం హాట్ ఫోటోల‌తో హీటెక్కించే వైనం తెలిసిందే. డిజైన్ వేర్స్ స‌హా బికీన దుస్తుల్లో నుష్ర‌త్ దుమారం యువ‌తలో అగ్గిరాజేస్తుంటుంది. ఆ ర‌కంగా సోష‌ల్ మీడియా అనుచ‌ర గ‌ణాన్ని డై బైడే బ‌ల‌ప‌రుచుకుంటుంది. తాజాగా అమ్మ‌డు ఫ్యాంట్ షూట్ లో ద‌ర్శ‌న‌మిస్తోన్న ఫోటోలు కొన్ని ఇన్ స్టాలో వైర‌ల్ గా మారాయి. వైట్ అండ్ వైట్ షూట్ లో నుష్ర‌త్ ఇలా త‌ళుక్కున మెరిసింది.

మ్యాచింగ్ హైహిల్స్ షూట్ ని మ‌రింత ఆక‌ర్ష‌ణీయంగా మార్చాయ‌ని చెప్పొచ్చు. ది లూమార్ట్ జ్యెయ‌ల‌రీ అమ్మ‌డి నెక్ని మ‌రింత అందంగా మ‌లిచాయి. ఈ ఫోటో షూట్ ని నిధిజేస్వానీ స్టైలిష్ చేయ‌గా.. అశ్విన్ హెయిర్ స్టైలిష్ గా వ్య‌వ‌హ‌రించారు. త‌న్వీష్ మార్తే మేక‌ప్ ఆర్టిస్ట్ గా ప‌నిచేసారు. శివ‌మ్ గుప్తా బ్యూటీని ఇంత అందంగా క్యాప్చ‌ర్ చేసారు.