Begin typing your search above and press return to search.
నూతన్ - గణేష్ ల ఎలిమినేషన్ కు కారణం ఇదే
By: Tupaki Desk | 3 Sep 2018 8:53 AM GMTతెలుగు బిగ్ బాస్ సీజన్ 2 అనౌన్స్ చేయగానే అందరిలో ఆసక్తి రేకెత్తింది. మొదటి సీజన్ సూపర్ హిట్ అవ్వడంతో రెండవ సీజన్ కూడా తప్పకుండా బాగుంటుందనే అభిప్రాయం అందరిలో వ్యక్తం అయ్యింది. అయితే రెండవ సీజన్ కు ఎన్టీఆర్ కాకుండా నాని హోస్ట్ అనడంతో ప్రేక్షకులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. అయితే ఈసారి సెలబ్రెటీలతో పాటు సామాన్యులు కూడా గేమ్ ఆడబోతున్నారు అంటూ ఆసక్తిని కలిగించారు. ముగ్గురు సామాన్యులను ఇంట్లోకి పంపించిన బిగ్ బాస్ నిర్వాహకులు ఆసక్తికరంగా షోను నడిపించడంలో విఫలం అయ్యారు. నాని హోస్టింగ్ ఆకట్టుకోలేక పోవడంతో పాటు పార్టిసిపెంట్స్ ఎవరు కూడా పెద్దగా గుర్తింపు లేని వారు అయిన కారణంగా ప్రేక్షకులు పెదవి విరుస్తూ వచ్చారు.
గేమ్ కొన్ని వారాలు పూర్తి అయిన తర్వాత కౌశల్ ఆర్మీ దయ వల్ల మంచి పబ్లిసిటీ దక్కించుకుంది. భారీ ఎత్తున టీఆర్పీ రేటింగ్ ను కూడా దక్కించుకున్నట్లుగా టాక్ వినిపించింది. ఈ సమయంలోనే బిగ్ బాస్ నిర్వాహకులపై విమర్శలు కూడా మొదలు అయ్యాయి. ఎలిమినేట్ అయిన వారి రీ ఎంట్రీ నిర్ణయం అతి పెద్ద తప్పుగా చెప్పుకోవచ్చు. దానికి తోడు నూతన్ నాయుడు పదే పదే అవకాశాలు ఇవ్వడంతో ఏదో జరుగుతుందని - నూతన్ నాయుడు భారీ మొత్తంలో షో నిర్వాహకులకు ఇచ్చినట్లుగా విమర్శలు వస్తున్నాయి. రెండు సార్లు నూతన్ బయటకు వెళ్లి లోనికి రావడంతో ఆ పుకార్లకు బలం చేకూరినట్లయ్యింది. అందుకే తాజా ఎలిమినేషన్ లో నూతన్ నాయుడును బయటకు పంపించి ఉంటారు అంటున్నారు.
‘బిగ్ బాస్’లో గత వారం ఎలిమినేషన్ కు నామినేట్ అయిన వారిలో కౌశల్ కు అత్యధికంగా ఓట్లు దక్కగా - అత్యల్పంగా గణేష్ కు పడ్డాయని సమాచారం అందుతుంది. ఇక డబుల్ ఎలిమినేషన్ ఉండటంతో కౌశల్ తర్వాత స్థానంలో ఉన్నది నూతన్ నాయుడు అని - నాల్గవ స్థానంలో అమిత్ ఉన్నాడు కనుక ఖచ్చితంగా అమిత్ కు ఎలిమినేషన్ తప్పదు అంటూ ప్రచారం జరిగింది. స్టార్ మా వర్గాల నుండి కూడా అదే టాక్ వినిపించింది. కాని నూతన్ నాయుడును ఇంకా ఇంట్లో కొనసాగిస్తే డబ్బు తీసుకుని ఆయన్ను ఉంచుతున్నట్లుగా బిగ్ బాస్ షో నిర్వాహకులపై విమర్శలు మరింతగా వచ్చే అవకాశం ఉందని, అందుకే నూతన్ నాయుడును ఎలిమినేట్ చేసినట్లుగా సమాచారం అందుతుంది. విమర్శలు వస్తాయని ఓట్లు ఎక్కువగా వచ్చినా కూడా నూతన్ నాయుడును ఎలిమినేట్ చేసిన బిగ్ బాస్ టీం పై కౌశల్ ఆర్మీ విరుచుకు పడుతుంది. ఈ సీజన్ లో మరో అతి పెద్ద తప్పుడు నిర్ణయం అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక గణేష్ ఓట్లు తక్కువగా రావడంతో పాటు గత కొన్ని రోజులుగా అతడు బిగ్ బాస్ పై -నానిపై కూడా విమర్శలు చేయడం, మైక్ తీసేసి తిట్టడం చేశాడు. అందుకే అతడిని ఎలిమినేట్ చేశారు అంటూ ప్రచారం జరుగుతుంది.