Begin typing your search above and press return to search.
రొమాంటిక్ సాంగ్: ఈ క్షణం ఈ మోహం ఏమిటో
By: Tupaki Desk | 21 Dec 2019 4:29 PM GMTప్రేమకథలు .. రొమాన్స్ జోనర్ ఎటర్నల్. టీనేజర్స్.. యూత్ కి ఈ తరహా సినిమాలపై ఉండే ఆసక్తి వేరు. ఏజ్ అలా ప్రేరేపిస్తుంది. అందుకే ఈ తరహా కథాంశాల్ని ఎంచుకుని యూత్ ని థియేటర్లకు రప్పించే ఎత్తుగడలు వేస్తుంటారు మన మేకర్స్. లవ్ సబ్జెక్ట్ వర్కవుటైతే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురుస్తుందని ఎన్నోసార్లు ప్రూవ్ అయ్యింది. స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ వారసుడు ఆకాష్ పూరీని పరిచయం చేస్తూ తెరకెక్కించిన `మెహబూబా` ప్రేమకథా చిత్రమే. అయితే ఆ సినిమా విషయంలో అనుకున్నది ఒకటి .. జరిగింది ఇంకొకటి. నటుడిగా ఆకాష్ మాత్రం ఫెయిల్ కాలేదన్న టాక్ వచ్చింది. ఇప్పుడు అదే కాన్ఫిడెన్స్ తో రెండోసారి నిర్మాతగా సాహసం చేస్తున్నారు పూరి. ఈసారి ఎట్టి పరిస్థితిలో ఆకాష్ కి ఓ హిట్టివ్వాలన్న తపనతో పూరి-ఛార్మి బృందం నిర్మాతలుగా మారి అనీల్ పాడూరికి దర్శకుడిగా అవకాశం ఇచ్చారు.
ఆకాష్ హీరోగా రొమాంటిక్ ప్రస్తుతం శరవేగంగా పూర్తవుతోంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు యూత్ లోకి దూసుకెళ్లాయి. తాజాగా `నువ్వు నేను ఈ క్షణం..` అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. టైటిల్ కి తగ్గట్టే రొమాంటిక్ సాంగ్ ఇది. డెబ్యూ నాయిక కేతిక శర్మతో ఆకాష్ పూరి రొమాన్స్ హీటెక్కిస్తోంది. డెబ్యూ దర్శకుడు అనీల్ టేకింగ్ విషయంలో పూరీని ఫాలో చేశాడా? అనిపించక మానదు. పాట ఆద్యంతం నాయకానాయికలు రొమాన్స్ పైనే దృష్టి సారించారు. అలాగే బీచ్ ఇసుకలో కేతిక అందాల ఎలివేషన్ పై దృష్టి సారించారు. అంతా బాగానే ఉన్నా.. ప్రేమలోని ఆ ఫీల్ ని తెచ్చే మూవ్ మెంట్ ఒక్కటీ కనిపించలేదు. ప్రేమను మించి మోహమే డామినేట్ చేస్తోంది ఈ టీజర్ లో.
``దేశాన్ని ప్రేమించడం వేరు .. ఆడదాన్ని ప్రేమించడం వేరు..! ఐలవ్ ఇండియా రూపాయి ఖర్చుండదు.. ఐలవ్ యు సరదా తీరిపోద్ది..`` అంటూ పూరి వాయిస్ లోనే మొత్తం మీనింగ్ చెప్పేశారు. ``రేయి పగలు ఎదురు చూశా.. ఈ క్షణం కోసం.. కోటి దండాలు పెట్టుకున్నా.. ఈ ఘడియ కోసం..`` అంటూ మోనిక విరహాన్ని మోహాన్ని చూపించారు. మోనిక(కేతిక) తొలి వలపు ప్రేమలో రొమాన్స్ పీక్స్ అనే చెప్పాలి. అయితే పూరి-అనీల్ బృందం ప్రేమ కంటే మోహం హద్దు దాటుతుందనే వ్యవహారాన్ని చూపించదలిచారా? ప్రేమలో సున్నితత్వం మరిచి టీనేజర్స్ లో ఆ క్షణం ప్రత్యక్షమయ్యే మోహంపై దృష్టి సారించారా? ఆడా మగా ఇద్దరికీ కోరిక ఒక్కటే... అని చెప్పబోతున్నారా? అసలు రొమాంటిక్ అనే టైటిల్ పెట్టుకున్నందుకు ఏం చూపించబోతున్నారు? అన్న సందేహాలు కలగక మానవు. నీ మాటలు నావి.. నీ కోరిక నాది.. నాక్కూడా నీమీద అలానే ఉంది.. కోరికో మోహమో... ఏదైతేనేం! మొత్తానికి పోయెట్రీ కూడా కాస్తంత ఎక్కువైనట్టే కనిపిస్తోంది. అయితే ఏదీ శ్రుతి మించకుండా బ్యాలెన్స్ చేయడంలో స్టోరి పరంగా గ్రిప్పింగ్ చూపించడంలో కొత్త దర్శకుడు ఏమేరకు సక్సెసయ్యాడు? అన్నదే సినిమా జయాపజయాలకు కారణమవుతుంది. గత తప్పిదాల్ని పూరి రిపీట్ చేయడనే భావిద్దాం.