Begin typing your search above and press return to search.
వార్నీ.. మహేష్ రెమ్యూనరేషన్ అంతా?
By: Tupaki Desk | 16 Nov 2015 1:47 PM GMTరెండు పెద్ద ఫ్లాపుల తర్వాత కూడా ‘శ్రీమంతుడు’ లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన ఘనత మహేష్ బాబుది. అతడి బాక్సఫీస్ స్టామినా గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అందుకే నిర్మాతలు మహేష్ మీద ఎంత పెట్టుబడి పెట్టడానికైనా వెనుకాడరు. రెమ్యూనరేషన్ విషయంలోనూ మహేష్ మిగతా టాలీవుడ్ హీరోలందరి కంటే ఎప్పుడూ ముందే ఉంటాడు. ఇప్పటికే రూ.17 కోట్ల రెమ్యూనరేషన్ తో రికార్డు నెలకొల్పాడు మహేష్.
ఇప్పుడు తన తర్వాతి సినిమాకు ఇంకో రూ.8 కోట్లు అదనంగా పారితోషకం తీసుకోబోతున్నట్లు సమాచారం. మురుగదాస్ దర్శకత్వంలో చేయబోయే సినిమాకు మహేష్ రెమ్యూనరేషన్ రూ.25 కోట్లని సమాచారం. ఇది మహేష్ డిమాండ్ చేసి తీసుకున్నది కూడా కాదు. నిర్మాత ఎన్వీ ప్రసాదే సూపర్ స్టార్ కు ఈ ఆఫర్ ఇచ్చినట్లు తెలిసింది. ఈ మూవీ బడ్జెట్ రూ.110 కోట్లని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.
సినిమా రేంజి కూడా వేరేగా ఉంటుంది కాబట్టి.. తమిళ - హిందీ భాషల్లోనూ భారీగా విడుదల చేయబోతున్నారు కాబట్టి మహేష్ కు పాతిక కోట్లివ్వడం పెద్ద మ్యాటర్ కాదు. సినిమా మొదలవడానికి ఆరు నెలల ముందే మహేష్ డేట్లు తీసుకుంటుండం.. రెగ్యులర్ గా మహేష్ తన సినిమాలకు కేటాయించే కాల్ షీట్స్ కంటే ఎక్కువివ్వడంతో అతడికి రూ.25 కోట్ల రెమ్యూనరేషన్ ఆఫర్ చేశాడు నిర్మాత.