Begin typing your search above and press return to search.
'ఆక్వామేన్' పై 30కోట్ల బెట్టింగ్
By: Tupaki Desk | 20 Nov 2018 4:33 AM GMTఇండియాలో హాలీవుడ్ సినిమా విస్తృతి అంతకంతకు పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా బిలియన్ ట్రిలియన్ డాలర్లు కొల్లగొడుతున్న హాలీవుడ్ హైఫై టెక్నలాజికల్ సినిమాలు ఇండియా నుంచి ఏకంగా 300-500కోట్ల వసూళ్లను సాధిస్తున్నాయి. మునుపెన్నడూ లేని అసాధారణ పరిణామమిది. జంగిల్ బుక్ - అవతార్ - డెడ్ పూల్ - అవెంజర్స్ - సూపర్ మేన్ - స్పైడర్ మేన్ - జురాసిక్ పార్క్ - జురాసిక్ వరల్డ్ - బ్లాక్ పాంథర్.. ఒకటేమిటి ఈ తరహా సిరీస్ లు సంచలన విజయాలు సాధిస్తూ దేశం నుంచి సొమ్ముల్ని కొల్లగొడుతున్నాయి. ప్రాంతీయ భాషల నుంచి కోట్లలో సొమ్ముల్ని హాలీవుడ్ ఎగరేసుకెళుతోంది. అందుకే ప్రాంతీయ భాషల్లోనూ ఈ సినిమాల రిలీజ్‌లకు మేకర్స్ - పంపిణీదారులు ఆసక్తి చూపిస్తున్నారు.
తాజాగా హాలీవుడ్ నుంచి `ఆక్వామేన్` సిరీస్ ఇండియా మార్కెట్ పైనా కన్నేసింది. తొలిగా `ఆక్వామేన్` ట్రైలర్ తో ఆడియెన్ ని సంభ్రమాశ్చర్యాలకు గురి చేశారు. ఈ సినిమాని ప్రఖ్యాత ఎన్ విఆర్ సినిమాస్ తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తోంది. ఆక్వామేన్ ట్రైలర్ వీక్షించిన వెంటనే దానిని తెలుగు వెర్షన్ రిలీజ్ చేయాలని సదరు నిర్మాతలు భావించారట. వెంటనే డీల్ మాట్లాడి ఓకే చేసుకున్నారు. భూమ్మీద జీవులకు ప్యారలల్ గా సముద్రంలో మత్య్సాల్లా సంచరించే ఆక్వామేన్ సమాజం లైఫ్ స్టైల్ ని వింత వింత అనుభూతులను కలిగించేలా డిజైన్ చేసిన పాత్రలతో - అద్భుత వీఎఫ్ ఎక్స్ మాయాజాలంతో రూపొందించిన ఈ సినిమాని ప్రఖ్యాత డీసీ సంస్థ వార్నర్ బ్రదర్స్ తో కలిసి నిర్మించింది. డిసెంబర్ 23న ఈ సినిమా ప్రపంచ దేశాల్లో రిలీజవుతోంది. సైమల్టేనియస్ గా తెలుగు రాష్ట్రాల్లోనూ రిలీజ్ కానుంది. మారిన ట్రెండ్ లో - మల్టీప్లెక్స్ కల్చర్ విస్తృతి పెరుగుతున్న వేళ ఈ తరహా సినిమాలతో భారీ లాభాలార్జించాలన్నది మన డిస్ట్రిబ్యూటర్ల మైండ్ సెట్ అని తెలుస్తోంది.
ఇక ప్రఖ్యాత ఎన్ విఆర్ సంస్థలో ప్రముఖ పంపిణీదారుడు - మెగా నిర్మాత అయిన ఎన్ వి ప్రసాద్ - నైజాం కింగ్ కం ఉత్తరాంధ్ర- వైజాగ్ కింగ్ డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు - యువి క్రియేషన్స్ వంశీ భాగస్వాములుగా ఏర్పాటు చేసిన ఎన్ వీఆర్ సినిమాస్ పంపిణీరంగంలో బిగ్ గేమ్ కి తెర తీయడం సర్వాత్రా ఆసక్తికర చర్చకు తావిచ్చింది. ఈ బృందం ప్రత్యర్థులతో పోటీపడుతూ భారీ మొత్తాల్ని కోట్ చేస్తూ చెమటలు పట్టిస్తోంది. ఈనెల 29న రిలీజవుతున్న ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ 2.ఓ (రోబో2) రిలీజ్ హక్కుల్ని ఎన్ విఆర్ సంస్థ భారీ పోటీలో చేజిక్కించుకుంది. అదే తీరుగా ఆక్వామేన్ ఇండియా వైడ్ రిలీజ్ హక్కుల్ని ఎన్.వి.ఆర్. సంస్థ ఛేజిక్కించుకుంది. 2.ఓ రిలీజ్ తర్వాత 3డి సత్తా ఎంతో తెలుగు ఆడియెన్ కి మరింతగా తెలిసి రానుంది. అటుపై రిలీజ్ చేసే ఆక్వామేన్ కి భారీగా ప్రమోషన్ చేసి కేవలం తెలుగు రాష్ట్రాల నుంచి మినిమంగా 30కోట్లు వసూలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారని తెలుస్తోంది. తాజాగా `ఆక్వామేన్` ఫుల్ లెంగ్త్ ఇంగ్లీష్ ట్రైలర్ రిలీజై వీక్షకుల్ని సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తోంది. త్వరలోనే తెలుగు వెర్షన్ సహా ప్రాంతీయ భాషల ట్రైలర్లను రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది.