Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: బాలీవుడ్‌ నీళ్లు బాగా పడ్డాయ్‌

By:  Tupaki Desk   |   3 Jun 2016 10:04 AM GMT
ఫోటో స్టోరి: బాలీవుడ్‌ నీళ్లు బాగా పడ్డాయ్‌
X
టాలీవుడ్ లో ఎన్నిసార్లు కనిపించినా.. ఎన్ని మెరుపులు చూపించినా.. ఇక్కడ మధురిమరు అంతగా కలిసి రాలేదు. తెలుగు - కన్నడ - తమిళ్.. ఇలా పలు భాషల్లో నటించినా.. పాపకు కలిసొచ్చిందేమీ లేదు. కానీ బాలీవుడ్ లో చేసిన వన్ నైట్ స్టాండ్ మూవీ ఒక్కదాంట్లో చేసి బోలెడంత పేరు సంపాదించేసింది.

ఆ ఎఫెక్ట్ తో ఇఫ్పుడు.. ఇదుగో ఇలా రెచ్చిపోయి మరీ అందాలు చూపించేస్తోంది. హెయిర్ స్టైల్ - కాస్ట్యూమ్స్ - బొడ్డులో ఓ రింగ్.. అబ్బో ప్రతీ యాంగిల్ లోను మార్పు కొట్టొచ్చినట్లు కనిపించేస్తోంది. ముఖ్యంగా.. స్కిన్ టోన్ ఉంది చూశారూ.. దానికి కుర్రాళ్లు ఫిదా అయిపోయామని చెప్పేసుకుంటున్నారు. పేరు మారడం సంగతేమో కానీ.. అక్కడ పాదం మోపాక.. భామలో టోటల్ గానే మార్పొచ్చేసినట్లు కనిపిస్తోంది.

పేరు నైరా బెనర్జీగా మార్చుకోవడంతో బాగా కలిసొచ్చిందని ఈ భామ భావిస్తుంది కానీ.. బాలీవుడ్ కళ మాత్రం బాగా కనిపిస్తోందని చెప్పాలి. అసలీ ముద్దుగుమ్మ అరంగేట్రం హిందీతోనే అయినా.. తర్వాత ఇక్కడ ఆఫర్లు వస్తున్నాయని మకాం వేసింది. ఇక్కడ ఛాన్సులొచ్చాయి కానీ.. గుర్తింపు రాలేదు. అందుకే మళ్లీ వెనక్కెళ్లి అక్కడ తన ట్యాలెంట్ అంతా చూపించేస్తోంది. వన్ నైట్ స్టాండ్ ఆడకపోయినా.. ఈ సుందరాంగికి వచ్చిన గుర్తింపు అంతా ఇంతా కాదు.