Begin typing your search above and press return to search.
అసిస్టెంట్ డైరక్టర్ అవతారమెత్తేసిందే
By: Tupaki Desk | 13 May 2016 6:33 AM GMTఅంతే ఒక్కోసారి.. ఎవరు ఏం చేస్తారో చెప్పడం చాలా కష్టం. ప్రస్తుతం హీరోయిన్ మధురిమా బెనర్జీ ఎలియాస్ నైరా బెనర్జీ పరిస్థతి కూడా అలాగే ఉంది. అమ్మడు తెలుగులో శతవిధాలుగా తన ప్రెజన్స్ ప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నించింది. బీభత్సంగా ఒంపుసొంపులు వేసినా.. బికినీల్లో అందాలు ఆరేసినా.. చివరకు సిస్టర్ క్యారెక్టర్లు చేసినా కూడా వర్కవుట్ కాలేదు. అందుకే కాస్త సన్నబడి బాలీవుడ్ లో అడుగుపెట్టింది.
సన్నీ లియోన్ ''వన్ నైట్ స్టాండ్'' సినిమాలో ఓ చిన్న క్యారెక్టర్ చేసింది నైరా. అయితే ఆ సినిమా ఫ్లాప్. ఇప్పటివరకు వచ్చిన సన్నీ లియోన్ సినిమాలన్నింటికలోకీ ఇదే వీకెస్ట్ అని చెప్పారు క్రిటిక్స్. అయితే ఈ సినిమాను డైరక్ట్ చేసిన లేడీ డైరక్టర్ జాస్మిన్ డి'సౌజీ పెనిమిటి టోనీ డి'సౌజా కూడా దర్శకుడే. ఆయన తీసిన సినిమాయే 'అజార్'. అందుకే ఆయన దగ్గర అజార్ సినిమాకు అసిస్టెంట్ డైరక్టర్ గా పనిచేసిందట నైరా. దీని వలన ఏంటమ్మా లాభం అంటే.. సినిమా మీద బెటర్ అండర్ స్టాండింగ్ ఉండాలంటే ఖచ్చితంగా అసిస్టెంట్ గా పనిచేయాలి అని చెప్పుకొచ్చింది.
పైగా అల్లాటప్పా అసిస్టెంట్ కాదండోయ్ ఈమె.. తన దర్శకుడితోపాటు లండన్ అండ్ హైదరాబాద్ కూడా ట్రావెల్ చేసి.. చాలా నేర్చేసుకుందట. హైదరాబాద్ లో షూటింగ్ చేస్తున్నప్పుడు మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ఇంటి నుండి వచ్చిన బిర్యానీ కూడా అద్భుతం అంటోంది. తరువాత ప్రయత్నంగా సొంతంగా సినిమా తీస్తుందేమో నైరా మరి.