Begin typing your search above and press return to search.

షాకింగ్: స్టార్ కిడ్స్ ఇద్ద‌రు ఒకే ప‌బ్ లో? ఇదెలా సాధ్యం!

By:  Tupaki Desk   |   2 Sep 2022 10:34 AM GMT
షాకింగ్: స్టార్ కిడ్స్ ఇద్ద‌రు  ఒకే ప‌బ్ లో? ఇదెలా సాధ్యం!
X
ధ‌నికుల ఆస్వాద‌నంతా సాయంత్రం నుంచే మొద‌ల‌వుతుంది. మెట్రోపాలిట‌న్ సిటీస్ లో రెగ్యుల‌ర్ గా జ‌రిగే తంతు ఇది. అదీ వీకెండ్ వ‌చ్చిందంటే? పార్టీల ర‌చ్చ మామూలుగా ఉండ‌దు. హైఫై పీపూల్స్ అంతా పార్టీలో మునిగిపోతారు. ఇక బాలీవుడ్ సెలబ్రిటీల పార్టీ క‌ల్చ‌ర్ గురించైతే చెప్పాల్సిన ప‌నిలేదు. కుర్ర భామంలా ఒకేచోట క‌లిసి గంపా గుత్తుగా పార్టీని ఎంజాయ్ చేస్తారు.

తాజాగా అతిలోక సుంద‌రి శ్రీదేవి-బోనీక‌పూర్ చిన్న కుమార్తె ఖుషీ క‌పూర్- అజ‌య్ దేవ‌గ‌ణ్ కాజ‌ల్ దంప‌తుల ముద్దుల త‌న‌య నైసా దేగ‌ణ్ అదే తీరున పార్టీ మోడ్ లోకి జారుకున్న‌ట్లు తెలుస్తోంది. ఇద్ద‌రు ఒకే చోట పార్టీకి హాజ‌ర‌య్యారు.

తాజాగా దానికి సంబంధించిన‌ వీడియో ఒక‌టి వైర‌ల్ అవుతుంది. ఖుషీ బ్లాక్ బాడీకాన్ డ్రెస్‌లో అంద‌గా కనిపించగా.. నైసా ఎరుపు రంగు దుస్తులు మరియు ప్రింటెడ్ జాకెట్‌లో గ్లామరస్‌గా క‌నిపిస్తుంది.

పార్టీ ముగించ‌కుని ఇద్ద‌రు ఒకే కారులో ఇంటికెళ్లిన‌ట్లు తెలుస్తోంది. పార్టీలో వారితో పాటు వారి కామన్ ఫ్రెండ్ ఓర్హాన్ అవత్రామణి కూడా ఉన్నారు. అయితే ఖుషీ-నైసా జంట‌గా పార్టీకి హాజ‌ర‌వ్వ‌డం ఇదే తొలిసారి. గ‌తంలో ఎప్పుడూ ఇలా జ‌ర‌గ‌లేదు. ఇద్ద‌రు వేర్వేరుగా హాజ‌రైన సంద‌ర్భాలున్నాయి త‌ప్ప ఒకే ప‌బ్ లో పార్టీకి వెళ్ల‌డం..క‌లిసి ఒకే కారులో ప్ర‌యాణించ‌డం నెటి జ‌నుల్లో చ‌ర్చ‌కొస్తుంది.

ఇలా స్టార్ కిడ్స్ ఇద్ద‌రు క‌నిపించేస‌రికి ఛాయాగ్రాహ‌కులు త‌మ కెమెరాలికి ఓ రేంజ్లో ప‌నిచేప్పారు. ప్ర‌స్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. పార్టీ భామ‌ల్ని ఇద్ద‌రు అలా చూసి నెటి జ‌నులు పుల్ల‌కించిపోతున్నారు.

కాగా ఖుషీ బాలీవుడ్ అరంగేట్రం కోసం సిద్ధమవుతోంది. జోయా అక్తర్ తెర‌కెక్కిస్తోన్న 'ది ఆర్చీస్స తో అమ్మ‌డు లాంచ్ అవుతుంది. ఇదే సినిమాతో షారుఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ మరియు అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నందా కూడా తెరంగేట్రం చేస్తున్నారు. ఇక నైసా దేవ‌గ‌ణ్ మాత్రం ఇంకా బాలీవుడ్ వైపు చూస్తున్న‌ట్లు లేదు. మ‌రి స‌రైన టైం కోస వెయిట్ చేస్తుందా? లేక సినిమాలంటే ఆస‌క్తి లేదా? అన్న‌ది తెలియాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.