Begin typing your search above and press return to search.

పార్టీలు స‌రే కానీ హీరోయిన్ అయ్యేదెపుడు?

By:  Tupaki Desk   |   5 July 2022 4:06 AM GMT
పార్టీలు స‌రే కానీ హీరోయిన్ అయ్యేదెపుడు?
X
పార్టీలో ఫుల్ గా చిల్ అయితే ఆ కిక్కే వేరు. బాలీవుడ్ లో క‌ర‌ణ్ జోహార్ ఏర్పాటు చేసే నైట్ పార్టీల‌కు న‌వ‌త‌రంతో పాటు సీనియ‌ర్లు విచ్చేస్తుంటారు. ఇక స్టార్ కిడ్స్ అంతా ఒక చోట ఏక‌మై పార్టీలు చేసుకునే క‌ల్చ‌ర్ కూడా అక్క‌డ ఉంది.

ఇందుకు అజ‌య్ దేవ‌గ‌న్- కాజోల జంట కుమార్తె నైసా దేవ‌గ‌న్ మిన‌హాయింపేమీ కాదు. నైసా పేరుకు త‌గ్గ‌ట్టే టీనేజీలో ఎంతో నైస్ గా క‌నిపిస్తోంది. స్టార్ డాట‌ర్ త్వ‌ర‌లో హీరోయిన్ అవుతుందో లేదో క్లారిటీ లేదు కానీ త‌ను ప‌క్కా పార్టీ గాళ్ అనడంలో డౌట్ లేదు.

నైసా తరచుగా అర్జున్ రాంపాల్ కుమార్తె మహికా రాంపాల్ తో ఇతర స్నేహితులతో కలిసి పార్టీల్లో జాయిన‌వుతుంటుంది. క్ల‌బ్ ప‌బ్ వెకేష‌న్ ఇలా ప్ర‌తిదీ చిల్లింగ్ గా ప్లాన్ చేస్తుంటుంది.

ఇటీవ‌ల లండన్ లోని దువా లిపా కచేరీ నుండి నైసా పార్టీ చేసుకుంటున్న ఫోటోలు వైర‌ల్ అయ్యాయి. త‌న స్నేహితుల్లో ఒక‌రైన‌ ఓర్హాన్ అవత్రమణి వీటిని షేర్ చేసారు. ఇప్పుడు మళ్లీ మహికా రాంపాల్ తో కలిసి నైసా దేవగన్ పార్టీ చేసుకునే మూడ్ లో ఉంది. అలాగే జాన్వీతో... షాన‌యా క‌పూర్ తోనూ నైసా రేర్ గా పార్టీల‌కు వెకేష‌న్ల‌కు వెళుతుంటుంది. అందుకు సంబంధించిన ఫోటోలు వైర‌ల్ గా మారాయి.

నైసా దేవ‌గ‌న్ తొలుత కెమెరా వెన‌క ప‌నిని నేర్చుకుంటుంది. ఆ త‌ర్వాత న‌చ్చితే న‌టి అవుతుంది అని కూడా లీకులు అందాయి. అలాగే అక‌డ‌మిక్స్ పై పూర్తిగా దృష్టి సారించింద‌ట‌. త‌న కుమార్తె క‌థానాయిక అవుతుందా లేదా? అన్న‌దానిపై కాజోల్ కానీ దేవ‌గ‌న్ కానీ క్లారిటీ ఇవ్వ‌లేదు.

ఇక శ్రీ‌దేవి కుటుంబం నుంచి జాన్వీ త‌ర్వాత ఖుషీ క‌పూర్ క‌థానాయిక కానుంది. అలాగే క‌పూర్స్ కుటుంబం నుంచి షాన‌యా క‌పూర్ క‌థానాయిక‌గా తొలి సినిమా సెట్స్ పై ఉంది. దేవ‌గ‌న్ కుటుంబం నుంచి వార‌సురాలు నైసా హీరోయిన్ అవుతుందా లేదా? అన్న‌ది ప్ర‌క‌టించాల్సి ఉంది.