Begin typing your search above and press return to search.

కెవ్వ్!! కాజోల్ కి కూతురి పంచ్

By:  Tupaki Desk   |   2 Feb 2017 10:01 AM GMT
కెవ్వ్!! కాజోల్ కి కూతురి పంచ్
X
బాలీవుడ్ మాజీ హీరోయిన్ కాజోల్.. భర్త అజయ్ దేవగన్ లకు ఇద్దరు పిల్లలు. వీళ్ల పెద్ద కూతురు పేరు నైసా. కొడుకు పేరు యుగ్. ప్రస్తుతం నైసా వయసు 14 సంవత్సరాలు. కాజోల్.. టీనేజ్ అమ్మాయి నైసాలు ఇద్దరూ సోషల్ మీడియాలో భలే యాక్టివ్ గా ఉంటారు. ప్రాక్టికల్ జోకులు కూడా బాగానే పేల్చుతూ ఉంటారు.

తాజాగా కాజోల్ పెట్టిన ఓ పోస్ట్ కి నైసా ఇచ్చిన కౌంటర్ అందరికీ తెగ నవ్వులు తెప్పించేసింది. మూడు రకాల ఫీలింగ్స్ ఎక్స్ ప్రెషన్స్ తో ఉన్న తన ఫోటోను తనే పోస్ట్ చేసిన కాజోల్.. 'నా పిల్లలు ఇద్దరినీ కలిసి చూస్తున్నపుడు నా ఫీలింగ్ ఇది' అంటూ కామెంట్ పెట్టింది. పిల్లల చేష్టలను చూసి.. ఇలాంటి ఫీలింగ్స్ కలగడం కామనే కానీ.. దీనికి కూతురు నైసా దేవగన్ ఇచ్చిన కౌంటరే ఇంకా ఎక్కువ పేలింది.

'మామ్.. నువ్వు ఎందుకంత ఎక్స్ ట్రాగా ప్రవర్తిస్తావ్' అనేసింది నైసా దేవగన్. నైసా ఇచ్చిన కౌంటర్ అందరికి కనబడదు లెండి. ఎందుకంటే.. ఇన్ స్టాగ్రామ్ లో ఈమెది ప్రైవేట్ అకౌంట్. కాకపోతే.. కాజోల్ అకౌంట్ పబ్లిక్ కాబట్టి.. ఈ హీరోయిన్ ఎక్స్ ప్రెషన్స్ అందరికీ తెలుస్తాయి. కూతురు నైసా కౌంటర్ మాత్రం.. ఆమెను ఫాలో అయ్యేవాళ్లకే తెలుస్తుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/