Begin typing your search above and press return to search.
MAA భవంతి కోసం 1000 గజాలు కొనే శక్తి లేదా?
By: Tupaki Desk | 30 Jun 2021 12:51 PM GMTమూవీ ఆర్టిస్టుల సంఘం (మా) అసోసియేషన్ కి 1000 గజాలు ఇస్తామంటే పాతికేళ్ల క్రితమే వదులుకున్నారు. నేటి సినీ పెద్దలకు MAA కోసం 1000 గజాల స్థలం కొనే శక్తి లేదా? అంటూ ప్రశ్నించారు ఓ.కళ్యాణ్.
ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్ లో జరిగిన సమావేశంలో .. మా ఎన్నికల వివాదంపై ఓ కళ్యాణ్ మాట్లాడుతూ-``మా అసోసియేషన్ అంపశయ్యపై ఉంది. 15 ఏళ్ల నుంచి మా లో అలజడి తప్ప అభివృద్ధి లేదు. మా ఎన్నికలు వచ్చాయంటే యుద్ధ వాతావరణం ఉంటుంది. మా ఎన్నికలు పంచాయతీ ఎన్నికల కంటే దారుణంగా తయారయ్యాయి. మా అసోసియేషన్ సర్వీస్ ఓరియంట్ గా లేదు`` అని విమర్శించారు.
25 ఏళ్లుగా మా అసోసియేషన్ ఎందుకు భవనాన్ని నిర్మించడం లేదు. పద్మాలయ స్టూడియో వెనుక 1000 గజాల స్థలం అప్పటి ప్రభుత్వం ఇస్తే నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడున్న సినీ పెద్దలకు మా అసోసియేషన్ కు 1000 గజాల స్థలం కొనుగోలు చేసే శక్తి లేదా? అని ప్రశ్నించారు. మా అసోసియేషన్ ఎన్నికల ప్రకటన రాకుండానే ప్రకాశ్ రాజ్ ఎందుకు ముందుకు వచ్చారు? ప్రశ్నించేవాళ్లు తన చుట్టూ ఉన్నారన్న ప్రకాశ్ రాజ్ ... వాళ్లు ఎంత మందిని ప్రశ్నించారు?.
మా ఎన్నికల్లో నేను ఆరుసార్లు పోటీ చేసి ఓడిపోయాను . మద్దతిస్తూ గెలిపించిన వాళ్లు ఎన్నికలు పూర్తవగానే తప్పకుంటున్నారు. నేను ఏ పదవికి పోటి చేయడం లేదు.. ఎవరికి మద్దతు ఇవ్వడం లేదు. మా ఎన్నికలు జరగకుండా పెద్దలు ఏకగ్రీవంగా ఎన్నుకోవాలి. మా అసోసియేషన్ భవనానికి నా ఆస్తులమ్మి రూ.1.50 కోట్లు నేను ఇస్తాను `మా` అసోసియేషన్ ను కోమా నుంచి బయటపడేయాలని అన్నారు. మా అసోసియేషన్ అల్లరి కాకుండా సినీ పెద్దలు కాపాడాలని కోరారు.