Begin typing your search above and press return to search.

వసుమతీ అంటూ మతి పోగొట్టిన మహేష్

By:  Tupaki Desk   |   13 April 2018 9:00 PM IST
వసుమతీ అంటూ మతి పోగొట్టిన మహేష్
X
మహేష్ బాబు లేటెస్ట్ మూవీ భరత్ అనే నేను ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉండడంలో ఆశ్చర్యం లేదు. రిలీజ్ కి ఇంకా వారం రోజులు మాత్రమే గ్యాప్ ఉండడంతో.. సినిమా గురించిన ప్రతీ అప్ డేట్ వైరల్ అయిపోతోంది. ప్రమోషన్స్ లో కూడా మహేష్ అండ్ టీం మహా అగ్రెసివ్ గా ఉంది.

భరత్ అనే నేను ఆడియో ఫంక్షన్ నిర్వహించిన తర్వాత.. సాంగ్ ప్రోమోలతో ఆకట్టుకుంటున్నారు. ఇప్పుడు 'ఓ వసుమతీ' అంటూ సాగే పాటకు ప్రోమో రిలీజ్ చేశారు. కంప్లీట్ గా అందమైన సెట్స్ లోనే చిత్రీకరించిన ఈ పాట విజువల్ పరంగా సూపర్ గా ఉంది. భారీ ఖర్చుతో నిర్మించిన సెట్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి. డ్రెసింగ్ పరంగా కూడా మహేష్ కొత్త స్టైల్స్ ట్రై చేశాడనే సంగతిని బాగా ఎగ్జిబిట్ చేశారు. వసుమతీ అంటూ హీరోయిన్ కియారా అద్వానీ అందాన్ని పొగడ్డం కోసం ఈ పాటను కేటాయించాడు దర్శకుడు కొరటాల శివ.

హీరోయిన్ కూడా మహేష్ ను మ్యాచ్ చేసేలా డ్యాన్స్ చేస్తూ ఆకట్టుకుంటోంది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం కూడా ఆడియన్స్ ను మెప్పించేట్లుగానే ఉంది. టాప్ ట్రెండింగ్ లో ఉండడానికి అన్ని రకాల అర్హతలు ఉన్న వసుమతి సాంగ్.. భరత్ అనే నేను మూవీ పై అంచనాలను మరింతగా పెంచేలాగే ఉంది. చిన్నపాటి టీజర్ కే ఈ స్థాయిలో రెస్పాన్స్ వస్తోందంటే.. ఇక థియేటర్లలో మహేష్ అభిమానుల హంగామా అస్సలు ఆపతరం కాదేమో.

వీడియో ని చూడటానికి క్లిక్ చేయండి