Begin typing your search above and press return to search.
పునీత్ రాజ్ కుమార్ పై అసభ్య పోస్ట్.. నెటిజన్ అరెస్ట్
By: Tupaki Desk | 3 Nov 2021 9:59 AM GMTకన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అక్టోబర్ 29న కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన అభిమానులు ఇప్పటికీ ఆ బాధ నుంచి తేరుకోలేకపోతున్నారు. అయితే తాజాగా ఓ నెటిజన్ పునీత్ పై చేసిన పిచ్చి పనికి అరెస్ట్ కావాల్సి వచ్చింది.
దివంగత కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్ పై సోషల్ మీడియాలో అభ్యంతరకర సందేశాన్ని పోస్ట్ చేసిన యువకుడిని బెంగళూరు నగర సైబర్ క్రైమ్ విభాగం పోలీసులు అరెస్ట్ చేశారు. నటుడు శుక్రవారం గుండెపోటుతో మరణించారు.
బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ కమల్ పంత్ మాట్లాడుతూ ఒక యువకుడిని అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు ప్రారంభించాము. సైబర్ టీం దీనిపై విచారణ జరుపుతోందని తెలిపారు. అరెస్ట్ అయిన యువకుడికి సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించలేదు.
-పునీత్ సమాధిని దర్శించుకునేందుకు ఫ్యాన్స్ కు అనుమతి
పునీత్ రాజ్ కుమార్ సమాధిని దర్శించుకునేందుకు నేటి నుంచి అభిమానులకు అవకాశం కల్పించారు. అంత్యక్రియల సందర్భంగా 10 లక్షల మంది వరకూ పునీత్ పార్థీవదేహాన్ని దర్శించుకున్నారు. ఇంకా వస్తుండడంతో అభిమానులకు సమాధి దర్శనం కల్పించారు.
ఇక మంగళవారం పునీత్ సమాధికి కుటుంబ సభ్యులు ఐదురోజుల పాలశాస్త్రం పూజలు నిర్వహించారు. పూజ అనంతరం ఆయన అన్న, హీరో శివరాజ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. అభిమానుల కోరిక మేరకు బుధవారం నుంచి పునీత్ సమాధి సందర్శనానికి అనుమతి ఇవ్వనున్నట్టు ఆయన తెలిపారు.