Begin typing your search above and press return to search.
సమంత అక్టోబర్ ధమాకా
By: Tupaki Desk | 19 Aug 2017 1:27 PM IST2017 అక్టోబరు నెలను సమంత జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేదు. ఎందుకంటే ఆ నెల ఆరో తారీఖునే తను వలచిన అక్కినేని నాగచైతన్యను పెళ్లి చేసుకోబోతోందామె. ఐతే కేవలం పెళ్లి మాత్రం ఆమెకు ఎగ్జైట్మెంట్ ఇచ్చే విషయం కాదు. ఆ నెలలో సమంత కెరీర్లో ప్రత్యేకమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
అందులో ముందుగా చెప్పుకోవాల్సింది విజయ్ సరసన సమంత నటిస్తున్న ‘మెర్సల్’ గురించే. విజయ్ తో ఇంతకుముందు ‘కత్తి’.. ‘తెరి’ లాంటి బ్లాక్ బస్టర్లు ఇచ్చింది సమంత. ఇప్పుడు వీళ్లిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘మెర్సల్’ మీద అంచనాలు మామూలుగా లేవు. ‘తెరి’ దర్శకుడు అట్లీనే ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. ‘బాహుబలి’ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి స్క్రిప్టు సమకూర్చడం విశేషం. ‘మెర్సల్’ దీపావళి కానుకగా అక్టోబరు 18న విడుదల కాబోతోంది.
మరోవైపు ‘మనం’ తర్వాత తనకు కాబోయే మావయ్య నాగార్జునతో కలిసి నటిస్తున్న ‘రాజు గారి గది-2’ సైతం అక్టోబరులోనే విడుదలవుతుంది. ఆ నెల 13న ఈ చిత్రం రిలీజవుతుందని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు విజయ్ సేతుపతి సరసన సమంత నటిస్తున్న కొత్త సినిమాను కూడా అక్టోబర్లోనే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. దాని రిలీజ్ డేట్ ఇంకా ఖరారవ్వలేదు. మొత్తానికి అక్టోబరు 6న పెళ్లి చేసుకోబోతున్న సమంత.. వరుసగా తన కొత్త సినిమాల రిలీజ్ చూడబోతోందన్నమాట.