Begin typing your search above and press return to search.

కుమారి బ్యాక్ టు బ్యాక్‌... ఈసారి వర్కౌట్ అయ్యేనా?

By:  Tupaki Desk   |   25 Aug 2022 7:31 AM GMT
కుమారి బ్యాక్ టు బ్యాక్‌... ఈసారి వర్కౌట్ అయ్యేనా?
X
కుమారి 21ఎఫ్‌ సినిమా తో తెలుగు ప్రేక్షకులకు చేరువ అయిన ముద్దుగుమ్మ హెబ్బా పటేల్‌. కన్నడ సినిమా తో ఇండస్ట్రీలో అడుగు పెట్టినా కూడా తెలుగు సినిమాలపైనే ఈ అమ్మడు ఎక్కువ దృష్టి పెట్టింది.

కుమారి 21ఎఫ్‌ సినిమా తర్వాత ఈ అమ్మడి జోరు కొనసాగుతుందని అంతా భావించారు. కానీ ఈమె ఎంపిక చేసుకున్న సినిమాలు మరియు ఈ అమ్మడు చేసిన పాత్రల వల్లనో ఏమో కానీ తక్కువ టైమ్‌ లోనే క్రేజ్ కోల్పోయింది.

అయినా కూడా ఏదో విధంగా ఇండస్ట్రీలో కొనసాగుతూ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ మొదలుకుని ఐటెం సాంగ్ వరకు అనేక రకాలుగా సినిమాలు చేసిన హెబ్బా పటేల్‌ ఈ వారం ఆహా ద్వారా ఓదెల రైల్వేస్టేషన్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఓదెల రైల్వే స్టేషన్ లో ఆమె లుక్ ను చూస్తుంటే దండుపాళ్యం బ్యాచ్ లేడీ మాదిరిగా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఇప్పటి వరకు గ్లామర్ పాత్రల్లో కనిపించిన హెబ్బా పటేల్ ఈ విభిన్నమైన పాత్రను చేయడం ద్వారా నటిగా తనను తాను నిరూపించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

ఈ సినిమా వర్కౌట్ అయితే హెబ్బా పటేల్ మళ్లీ బిజీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మాస్ పాత్రలో హెబ్బా పటేల్ లుక్ కు ఇప్పటికే మంచి మార్కులు పడ్డాయి. దాంతో ఈ సినిమా వర్కౌట్ అయ్యేలా ఉందంటూ ఆమె అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఓదెల రైల్వే స్టేషన్ మాత్రమే కాకుండా హెబ్బా పటేల్ ఇంకా తెలిసినవాళ్లు... గీత... వల్లన్‌ మరియు ఆధ్య అనే తమిళ సినిమాల్లో కూడా నటిస్తోంది. ఈ సినిమాలన్నింటికంటే కూడా ఓదెల రైల్వే స్టేషన్‌ పైనే అందరి దృష్టి ఉంది. రేపు ఆహా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా హెబ్బా పటేల్ కెరీర్ ను ఏమైనా మార్చేనా చూడాలి.