Begin typing your search above and press return to search.
అమీర్ ఖాన్ సినిమాలో జేమ్స్ బాండ్ కి ఆఫర్!
By: Tupaki Desk | 28 July 2021 9:30 AM GMTబాండ్ సిరీస్ సినిమాలతో సంచలనాలు సృష్టించిన ది గ్రేట్ డేనియల్ క్రెయిగ్ పరిచయం అవసరం లేదు. అతను జేమ్స్ బాండ్ పాత్రలో మెరుపులు మెరిపించే బ్రిటీష్ నటుడిగా భారతదేశంలోనూ గొప్ప పాపులారిటీని తెచ్చుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా క్రెయిగ్ కి భారీ ఫాలోయింగ్ ఉంది.
అయితే అతడు జేమ్స్ బాండ్ కాక ముందు ఓ హిందీ చిత్రంలో నటించేందుకు ఆడిషన్స్ కి వచ్చారని తెలిసింది. అమీర్ ఖాన్ నటించిన క్లాసిక్ చిత్రం `రంగ్ దే బసంతి` కోసం అతడిని దర్శకుడు ఆడిషన్స్ చేశారని తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఇందులో అతడు ఏ పాత్ర కోసం ఆడిషన్స్ కి హాజరయ్యారు? అన్నది రంగ్ దే బసంతి చిత్ర దర్శకుడు రాకేశ్ ఓం ప్రకాష్ మెహ్రా తన తాజా ఆత్మకథ `ది స్ట్రేంజర్ ఇన్ ది మిర్రర్` లో వెల్లడించారు.
భారతదేశ స్వాతంత్య్ర పోరాటం నేపథ్యంలో సినిమా ఇది. ఆంగ్లేయుడైన జేమ్స్ మెకిన్లీ పాత్ర కోసం డేనియల్ క్రెయిగ్ ఆడిషన్ చేసినట్లు రాకేశ్ చెప్పారు. భగత్ సింగ్- రాజ్ గురు- సుఖ్ దేవ్ లను ఉరి తీసేందుకు ప్రయత్నించే యువ జైలర్ జేమ్స్ మెకిన్లీ పాత్రలో డేనియల్ క్రెయిగ్ నటించాల్సింది. డేనియల్ ఎంపికయ్యాడు కానీ.. జేమ్స్ బాండ్ పాత్రకు కూడా ఆడిషన్ చేస్తున్నందున ఈ చిత్రంలో నటించేందుకు తనకు కొంత సమయం కావాలని కోరినట్లు రాకేశ్ చెప్పారు. కానీ అదృష్టం డేనియల్ ని వరించింది. అతను జేమ్స్ బాండ్ పాత్రకు ఎంపికయ్యాడు. ఇది లైఫ్ టైమ్ అఛీవ్ మెంట్ లాంటిది. అతడు నటించిన మొదటి సినిమానే బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో వరుసగా మూడు సినిమాల్లో నటించాడు. రంగ్ దే బసంతిలో తెలుగు నటుడు సిద్ధార్థ్ కూడా కీలక పాత్రలో నటించారు.
BOND25 లో జేమ్స్ బాండ్ 007 సరికొత్తగా..
జేమ్స్ బాండ్ 007 సిరీస్ లో 25 సినిమాలు తెరకెక్కగా క్రెయిగ్ ఇప్పటికే ఈ ఫ్రాంఛైజీ గత రెండు చిత్రాల్లో బాండ్ గా నటించాడు. `నో టైమ్ టు డై` క్రెయిగ్ కి చివరి జేమ్స్ బాండ్ చిత్రం. ఆస్కార్ విజేత రామి మాలెక్ తాజా మూవీతో ఫ్రాంచైజీలోకి ఎంటర్ అయ్యాడు. ఇందులో బాండ్ ని ఢీకొనే విలన్ సఫిన్ పాత్రను పోషిస్తాడు. అంతేకాకుండా.. లియా సెడాక్స్ బాండ్ ప్రియురాలు డాక్టర్ మాడెలైన్ స్వాన్ గా తిరిగి చేరుతోంది. బాండ్ 25 లో ఎన్నో ట్విస్టులు ఉంటాయిట.
ఇకపోతే నో టైమ్ టు డై విడుదల కోసం ఇంకా వేచి ఉండాలని దర్శకుడు కారీ జోజి ఫుకునాగా వెల్లడించారు. తన ది వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రొఫైల్ పీస్ ప్రకటన సందర్భంగా ప్రారంభ సన్నివేశం గురించి వివరణాత్మక వర్ణనతో సిరీస్ అభిమానులను ఆటపట్టించాడు. తొలి సన్నివేశం జేమ్స్ బాండ్ సంప్రదాయాన్ని పూర్తిగా తుడిచేస్తోంది. బ్రిటీష్ స్పై 007 ప్రారంభ సన్నివేశంలో కనిపించడు. మునుపటి 24 బాండ్ చిత్రాలలో ఇది ఎప్పుడూ చూడనిది.
ఈ సిరీస్ లో బాండ్ పాత్రధారి క్రెయిగ్ కి చివరి సెండాఫ్ అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నాం. జేమ్స్ బాండ్ నో టైమ్ టు డై .. థ్రిల్లింగ్ ఓపెనింగ్ సీక్వెన్స్ ద్వారా తీర్పు ఇవ్వడాన్ని చిరస్మరణీయ వీడ్కోలుగా భావిస్తున్నాం అని దర్శకుడు తెలిపారు. బెన్ విషా- పలోమాగా అనా డి అర్మాస్ -లాషనా లించ్ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. నో టైమ్ టు డై 2021 ఏప్రిల్ 2 న విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడింది. ఈ సినిమా బ్రిటన్ లో సెప్టెంబర్ 30 న రిలీజ్ కానుండగా .. అక్టోబర్ 8న అమెరికాలో రిలీజ్ కానుంది. అంతకుముందే భారతదేశంలో రిలీజవుతుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.