Begin typing your search above and press return to search.

ఉద్యోగుల‌కు సెల‌వులా.. ఇదేం సినిమా పిచ్చి?

By:  Tupaki Desk   |   7 Jan 2020 5:49 AM
ఉద్యోగుల‌కు సెల‌వులా.. ఇదేం సినిమా పిచ్చి?
X
సూప‌ర్ స్టార్ రజనీకాంత్ క‌థానాయ‌కుడి గా న‌టించిన ద‌ర్బార్ రిలీజ్ కు ఇంకా రెండు రోజులే స‌మ‌యం ఉంది. మ‌రో 48 గంట‌ల్లో రిలీజ్ కాబ‌ట్టి కౌంట్‌ డౌన్ స్టార్ట్ అయిన‌ట్టే. త‌మిళ‌నాడు రాష్ట్ర‌ వ్యాప్తంగా ఉన్న థియేట‌ర్లను పూల దండ‌ల‌తో ముస్తాబ‌తున్నాయి. థియేట‌ర్ ముందు సూప‌ర్ స్టార్ భారీ క‌టౌట్ల‌ను ఏర్పాటు చేసి అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈ పొంగ‌ల్ కి త‌మిళ‌నాడు లో రిలీజ్ అవుతోన్న ఒకే స్టార్ హీరో సినిమా కావ‌డం తో అంద‌రి క‌ళ్లు ఈ సినిమా పైనే ఉన్నాయి. ద‌ర్బార్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఖాయ‌మ‌నే ర‌జ‌నీ అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు.

ప్ర‌స్తుతం త‌మిళ‌నాడు వ్యాప్తంగా ద‌ర్బార్ ఫీవ‌ర్ న‌డుస్తోంది. చెన్నై సిటీలో కొన్ని ప్ర‌యివేటు సంస్థ‌లు ఏకంగా సెల‌వుల‌ను ప్ర‌క‌టించాయి. మ‌రికొన్ని సంస్థ‌లు సెల‌వులతో పాటు ఉచితంగా ద‌ర్బార్ టిక్కెట్ల‌ను పంపిణీ చేసి సూప‌ర్ స్టార్ పై అభిమానం చాటుకున్నాయి. ఇంకా మ‌రికొన్ని సంస్థ‌లు ఉద్యోగులకు టిక్కెట్లు పంచి పెయిడ్ హాలీడేస్ ని ప్ర‌క‌టించాయి. సెల‌వు కావాలంటే ఆ రోజుకి కొంత డ‌బ్బు క‌డితే స‌ద‌రు సంస్థ‌నే టిక్కెట్ ఇచ్చి సెల‌వు ఇస్తుంద‌న్న మాట‌. మరోవైపు సేలంలోని ర‌జ‌నీ అభిమానులు ఒక‌డుగు ముందుకేసి ద‌ర్బార్ ప్ర‌ద‌ర్శించే థియేట‌ర్ల పై హైలికాప్ట‌ర్ నుంచి పూల వ‌ర్షం కురిపించడానికి స‌న్నాహాకాలు చేస్తున్నారు.

దానికి సంబంధించి ముంద‌స్తుగా ప్ర‌భుత్వం నుంచి అనుమ‌తి తీసుకునే ప్ర‌య‌త్నాల్లో ఉన్న‌ట్లు స‌మాచారం. గ‌తంలో సూప‌ర్ స్టార్ న‌టించిన పేట సినిమా విడుద‌లైన‌ప్పుడు కొన్ని ప్రయివేటు సంస్థ‌లు సినిమా టికెట్లు ఇచ్చి సెల‌వులు ప్ర‌క‌టించారు. థియేట‌ర్ స‌మీపంలో ఉన్న స్కూళ్ల‌కు ర‌ద్దీని దృష్టి లో పెట్టుకుని సెల‌వులు ఇచ్చారు. ఈ క్రేజ్ కేవ‌లం త‌లైవా సినిమాల‌కు మాత్ర‌మే సొంతం. అయితే త‌మిళ‌నాడులో అంత సంద‌డి జ‌రుగుతుంటే తెలుగు నాట మాత్రం అస‌లు ద‌ర్బార్ ఊసే లేదు ఎందుక‌నో.