Begin typing your search above and press return to search.
ఆఫీసర్ దెబ్బ అతనికి గట్టిగా తగిలిందా?
By: Tupaki Desk | 4 Jun 2018 8:54 AM GMTరాంగోపాల్ వర్మ డైరెక్షన్ లో నాగార్జున హీరోగా రూపొందిన ఆఫీసర్ మూవీ థియేటర్లలోకి వచ్చింది. ఈ మూవీ గురించి చెప్పుకునేందుకు నాగ్ ఫ్యాన్స్ కూడా పెద్దగా ఇష్టపడడం లేదు. అంతగా వారి ఆత్మస్థైర్యాన్ని.. అభిమానాన్ని ఈ చిత్రం దెబ్బ కొట్టింది. ఆఫీసర్ కారణంగా నష్టపోయిన వాళ్ల జాబితా బాగానే ఉంటుంది.
పెట్టిన పెట్టుబడిలో ఎంతో కొంత పోగొట్టుకోవడం వేరు.. మొత్తం ఇన్వెస్ట్ మెంట్ లో రూపాయి కూడా వెనక్కొచ్చే ఛాన్స్ లేకపోగా.. ఎదురు డిస్ట్రిబ్యూటర్లకు కట్టాల్సిన పరిస్థితి రావడం మరింత దారుణం. వారితో పాటు ఆఫీసర్ నిర్మాణంలో.. బ్యాక్ ఎండ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన జేడీ చక్రవర్తికి కూడా దెబ్బ గట్టిగానే పడుతోందట. వర్మ-నాగ్ కాంబినేషన్ కావడంతో.. ఈ సినిమాపై జేడీ బాగానే ఇన్వెస్ట్ చేశాడట. అయితే.. అంతో ఇంతో బిజినెస్ జరిగిదేమో కానీ.. ఈ మధ్య జరిగిన కొన్ని సిట్యుయేషన్స్ కారణంగా.. వర్మపై నమ్మకం దారుణంగా పతనమైంది.
దాంతో కనీసం నాలుగు డబ్బులొస్తాయి.. లాభం లేకపోయినా కనీసం అసలు వరకు వస్తుంది అనే ఆశలు కూడా గల్లంతయిపోయాయి. అయితే.. ఆఫీసర్ కారణంగా మరీ రోడ్డు మీద పడిపోయే పరిస్థితి అయితే ఈ బ్యాక్ ఎండ్ ప్రొడ్యూసర్ కు రాదని టాక్. ఇందుకు కారణం.. దాదాపు అన్ని ఏరియాలను ఎంతో కొంత మొత్తానికి అమ్మేసుకుని వదిలించేసుకోవడమే.