Begin typing your search above and press return to search.

టీజర్ టాక్: ఆఫీసర్ లెక్క కుదిరింది

By:  Tupaki Desk   |   9 April 2018 4:57 AM GMT
టీజర్ టాక్: ఆఫీసర్ లెక్క కుదిరింది
X
రెండు దశాబ్దాల గ్యాప్ తర్వాత రామ్ గోపాల్ వర్మ-నాగార్జున కాంబోలో వస్తున్న ఆఫీసర్ టీజర్ చెప్పిన టైం కి రిలీజ్ చేసేసారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం హెడ్ గా నారాయణ్ పసారి అనే మాజీ పోలీస్ ఆఫీసర్ కేసు కోసం హైదరాబాద్ నుంచి ముంబై వచ్చిన ఓ అధికారి కథే ఇది. టీజర్ ఉన్నది ఒక్క నిమిషమే అయినా సింగల్ లైన్ లో స్టొరీ రివీల్ చేసిన వర్మ చాలా కాలం తర్వాత తనదైన ట్రేడ్ మార్క్ యాక్షన్ డోస్ ఇందులో బాగా దట్టించినట్టు కనిపిస్తోంది. వర్మ సినిమాల్లో కనిపించే మాఫియా బ్యాక్ డ్రాప్ ఇందులో కూడా ఉన్నప్పటికీ ఎక్కువ ఫోకస్ నాగ్ క్యారెక్టరైజేషన్ మీద పెట్టడంతో ఫాన్స్ కి బాగా కనెక్ట్ అయ్యేలా ఉంది. నాగార్జునతో పాటు చిన్న పాపను కూడా యాక్షన్ సీక్వెన్స్ లో చూపించిన వర్మ వాళ్ళిద్దరి మధ్య బలమైన బాండింగ్ ఏదో పెట్టినట్టు ఉన్నాడు. శివ-క్షణ క్షణం-సత్య-కంపెనీ స్థాయి టెక్నీషియన్ ఇందులో వర్మ రూపంలో కనిపించాడు.

ముంబై బ్యాక్ డ్రాప్ కాబట్టి వాతావరణం నటీనటులు మొత్తం అక్కడి సెటప్ లాగే కనిపిస్తోంది. టీజర్ మొత్తంలో తెలుగు నటుల్లో అజయ్ మాత్రమే కనిపించాడు. ఓవర్ ది టాప్ క్రేన్ షాట్స్ పాత వర్మను గుర్తుకు తెస్తే తనకు ఇచ్చిన బాధ్యతను పూర్తి చేసే దాకా వదిలిపెట్టను అని నాగ్ సీరియస్ గా చెప్పడం మాస్ కి కిక్ ఇచ్చేదే. పాప నాగార్జునతో ఈ ఉద్యోగం చేయటం అవసరమా అని చెప్పించడం ద్వారా ఎమోషన్ కూడా బలంగా పండినట్టే అనిపిస్తోంది. శివలో అన్నయ్య కూతురికి నాగార్జునకు హార్ట్ టచింగ్ సెంటిమెంట్ పండించిన వర్మ ఇందులో అదే స్థాయిని ఈ పాప పాత్ర రిపీట్ చేసుంటాడని ఫాన్స్ నమ్మకం. బ్యాక్ గ్రౌండ్ ఎప్పటి లాగే ఎలివేట్ కాగా హెరాయిన్ మైరా సరీన్ ను గ్లామర్ పరంగా చూపించకుండా హెవీ డోస్ యాక్షన్ చేజింగ్ లో గన్నులు పేలుస్తూ చూపించడం కొసమెరుపు. మొత్తానికి వర్మ ఈజ్ బ్యాక్ అనిపించేలా ఆఫీసర్ ఉంటాడో లేదో మే 25న తేలనుంది. రక్షణ-శివమణి తర్వాత అంత ఇంటెన్సిటీ ఉన్న పోలీస్ ఆఫీసర్ పాత్ర నాగ్ చేయటం ఆఫీసర్ లోనే అని చెప్పొచ్చు

వీడియో కోసం క్లిక్ చేయండి