Begin typing your search above and press return to search.

అఫీషియ‌ల్: ప్ర‌భాస్‌ నుంచి అదిరిపోయే ట్రీట్ రెడీ!

By:  Tupaki Desk   |   27 Sep 2022 7:52 AM GMT
అఫీషియ‌ల్: ప్ర‌భాస్‌ నుంచి అదిరిపోయే ట్రీట్ రెడీ!
X
పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్నతొలి మైథ‌లాజిక‌ల్ మూవీ 'ఆది పురుష్‌'. ఐమాక్స్ వెర్ష‌న్ తో పాటు 3డీ వెర్ష‌న్ ని కూడా సిద్ధం చేస్తున్నారు. క‌నీ వినీ ఎరుగ‌ని రీతిలో ఇండియ‌న్ సినీ హిస్ట‌రీలోనే అత్యంత అధునాత‌న సాంకేతిక ప‌రిజ్ఞానంతో ఈ మూవీని మేక‌ర్స్ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. 'తానాజీ' వంటి చారిత్రాత్మ‌క సినిమాతో ద‌ర్శ‌కుడిగా మంచి పేరు తెచ్చుకున్న యంగ్ ఫిల్మ్ మేక‌ర్ ఓం రౌత్ ఈ మూవీని రూపొందిస్తున్నాడు.

టి సిరీస్, రెట్రో ఫైల్స్ సంయుక్తంగా అత్యంత భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీని రామాయ‌ణ గాథ ఆధారంగా జ‌ప‌నీస్ మూవీ 'రామాయ‌ణ : ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామా' స్ఫూర్తితో తెర‌కెక్కిస్తున్నారు. చిత్రీక‌ర‌ణ పూర్త‌యి నెల‌లు కావ‌స్తోంది. అయితే సీజీ వ‌ర్క్ కి పెద్ద స్కోప్ వున్న మూవీ కావ‌డంతో ఈ మూవీ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ కి చాలా స‌మ‌యం తీసుకుంటోంది. అంతే కాకుండా భార‌తీయులంతా అమితంగా ఇష్ట‌ప‌డే రామాయ‌ణ ఇతిహాసం నేప‌థ్యంలో అధునిక సాంకేతికతో ఓ దృశ్య‌కావ్యంగా హాలీవుడ్ సినిమాల‌కు ఏ మాత్రం తీసిపోని విధంగా ఐమ్యాక్స్, 3డీ ఫార్మాట్ ల‌లో ఈ మూవీని రూపొందిస్తున్నారు.

దీంతో ఈ మూవీ కోసం గ‌త కొన్ని నెల‌లుగా యావ‌త్ ఇండియా ఆస‌క్తిగా ఎదురుచూస్తోంది. గ‌త కొన్ని రోజులుగా ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ పై వ‌రుస క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. సినిమా పూర్త‌యి పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటున్నా కూడా మేక‌ర్స్ ఇంత వ‌ర‌కు ఈ మూవీ నుంచి ప్ర‌భాస్ ఫ‌స్ట్ లుక్ రాలేదు. దీంతో రాముడిగా ప్ర‌భాస్ ఎలా వుంటాడ‌న్న‌ది ప్ర‌తీ ఒక్క‌రిలోనూ ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఈ నేప‌థ్యంలో అక్టోబ‌ర్ 2న శ్రీ‌రాముడి జ‌న్మ‌స్థ‌ల‌మైన అయోధ్య‌లో ఫ‌స్ట్ లుక్ తో పాటు టీజ‌ర్ ని కూడా రిలీజ్ చేయ‌బోతున్నారు.

ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. అయితే మేక‌ర్స్ నుంచి దీనిపై అధికారికంగా ఎలాంటి ప్ర‌క‌ట‌న రాలేదు. తాజాగా మంగ‌ళ‌వారం ద‌ర్శ‌కుడు ఓం రౌత్ సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ వేదిక‌గా టీజ‌ర్, ఫ‌స్ట్ లుక్ పై క్లారిటీ ఇచ్చారు. 'మా మ్యూజిక‌ల్ ప్ర‌యాణం ఇక మీ సొంతం . మీ అనుభ‌వం, ప్రేమ‌. ఎంత‌గానో ఎదురుచూస్తున్న 'ఆదిపురుష్' టీజ‌ర్ తో పాటు ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ అక్టోబ‌ర్ 2న విడుద‌ల కానున్నాయి. వేదిక బ్యాంక్ ఆఫ్ స‌ర‌యు.. అయెధ్య‌, యుపి' అంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించారు.

దీంతో ప్ర‌భాస్ ఫ్యాన్స్ అక్టోబ‌ర్ 2 నుంచే దస‌రా సంబ‌రాలు మొద‌లు పెట్ట‌బోతున్నారు. ఇదిలా వుంటే తెలుగు, హిందీ భాష‌ల్లో ఒకేసారి రూపొందిన ఈ మూవీని ఈ రెండు భాష‌ల‌తో పాటు త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో రిలీజ్ చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే. భారీ అంచ‌నాలు నెల‌కొన్న ఈ మూవీని 2023 సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 12న రిలీజ్ చేయ‌నున్న విష‌యం తెలిసిందే.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.