Begin typing your search above and press return to search.
అఫిషియల్: 'ఆదిపురుష్' వాయిదా.. మళ్ళీ రిలీజ్ ఎప్పుడంటే..?
By: Tupaki Desk | 7 Nov 2022 5:23 AM GMTడార్లింగ్ అభిమానులకు నిరాశ ఎదురైంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ "ఆదిపురుష్" ఈ సంక్రాంతికి విడుదల కావడం లేదు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలను నిజం చేస్తూ.. మేకర్స్ ఈ సినిమా రిలీజ్ ని పోస్ట్ పోన్ చేశారు.
"ఆదిపురుష్" చిత్రాన్ని వాయిదా వేస్తున్న విషయాన్ని తెలియజేస్తూ సోమవారం ఉదయం చిత్ర బృందం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆడియన్స్ కు అద్భుతమైన విజువల్ ఎక్స్ పీరియన్స్ అందించడానికి మరికొంత సమయం తీసుకుంటున్నామని పేర్కొన్న మేకర్స్.. ఈ సందర్భంగా సరికొత్త రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు.
"ఆదిపురుష్ అనేది సినిమా కాదు. మన ప్రభు శ్రీరాముడిపై భక్తి, సంస్కృతి, చరిత్రలపై మనకున్న కమిట్మెంట్ కు నిదర్శనం. ప్రేక్షకులకు అద్భుతమైన పూర్తి విజువల్ అనుభూతిని అందించడం కోసం దీనిపై వర్క్ చేయటానికి టీమ్ కు మరికొంత సమయం అవసరం అవుతోంది. 2023 జూన్ 16న 'ఆదిపురుష్' చిత్రాన్ని విడుదల చేయనున్నాం. భారతదేశం గర్వించే సినిమా రూపొందించాలని మేము నిర్ణయించుకున్నాం. మీ ప్రేమాభిమానాలే మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నాయి" అని మేకర్స్ ప్రకటనలో పేర్కొన్నారు.
రామాయణ ఇతిహాసాన్ని ఆధారంగా చేసుకుని బాలీవుడ్ డైరక్టర్ ఓం రౌత్ 'ఆదిపురుష్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే దసరా కానుకగా విడుదలైన ఈ సినిమా టీజర్ పై సినీ అభిమానుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. వీఎఫ్ఎక్స్ వర్క్ మరియు గ్రాఫిక్స్ మరీ నాసిరకంగా ఉన్నాయని.. టీజర్ ఏమాత్రం ఆకట్టుకోలేదని ఏకిపారేశారు. అంతేకాదు ప్రధాన నటీనటుల లుక్స్ బాగాలేవని.. యానిమేషన్ చిత్రాన్ని తలపించేలా ఉన్నాయని ట్రోల్స్ చేశారు.
ఈ నేపథ్యంలో మరోసారి వీఎఫ్ఎక్స్ పనులపై చిత్ర బృందం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. మెరుగైన అవుట్ పుట్ కోసం మరో ఆరేడు నెలలు టైం తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో 'ఆదిపురుష్' సినిమాను సంక్రాంతి బరి నుంచి తప్పించారు. ప్రభాస్ సినిమా వాయిదా పడిందనే వార్తతో డార్లింగ్ ఫ్యాన్స్ నిరాశ చెందుతూ పోస్టులు పెడుతున్నారు.
ఇకపోతే ''ఆదిపురుష్" చిత్రానికి ఇప్పటికే రూ. 450 - 500 కోట్ల వరకూ ఖర్చు చేశారని ప్రచారం జరుగుతుండగా.. ఇప్పుడు మళ్ళీ వర్క్ చేయడం వల్ల అదనంగా మరో 100 కోట్లు అవుతుందని టాక్ నడుస్తోంది.
కాగా, ''ఆదిపురుష్'' సినిమాలో ప్రభాస్ శ్రీ రాముడిగా కనిపించనున్నారు. కృతి సనన్ కథానాయికగా సీత పాత్రలో నటిస్తుండగా.. లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్ నటిస్తున్నాడు. ప్రతినాయకుడు రావణుడి పాత్రలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు.
బాలీవుడ్ సంస్థ టీ-సిరీస్ నిర్మిస్తోన్న ఈ పౌరాణిక చిత్రాన్ని తెలుగులో యూవీ క్రియేషన్స్ రిలీజ్ చేయనుంది. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో విడుదల కాబోతోంది. 3డీ - ఐమాక్స్ ఫార్మాట్ లలో ఈ చిత్రాన్ని అందించడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.