Begin typing your search above and press return to search.
హమ్మయ్య వర్మ లైన్ క్లియర్ అయ్యింది
By: Tupaki Desk | 25 March 2019 10:57 AM GMTఅందరూ ఆశించినట్టు కాకుండా వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ కు లైన్ క్లియర్ అయ్యిందని సమాచారం. ఈ మేరకు వర్మ స్వయంగా ఓ వీడియోను ట్వీట్ చేస్తూ తన అభిమానులకు గుడ్ న్యూస్ అందించాడు. నిర్మాత రాకేష్ రెడ్డి ఎన్నికల సంఘం ముందు హాజరై ప్రివ్యూ తర్వాత అన్ని సందేహాలకు స్వయంగా సమాధానం ఇచ్చారట. ఎన్టీఆర్ భార్య లక్ష్మి పార్వతి రాసిన పుస్తకం ఆధారంగా ఇది నిర్మించడం జరిగింది తప్ప ఏ పార్టీని టార్గెట్ చేయలేదని చెప్పారట.
సినిమాలో పసుపు పచ్చ జెండాలు వాడటం మినహా అసలు గుర్తయిన సైకిల్ ని ఎక్కడా చూపించలేదని క్లారిటీ ఇచ్చినట్టు తెలిసింది. టిడిపి చెబుతున్న ముఖ్య అభ్యంతరం ఈ కోణంలోనే ఉంది కాబట్టి టిడిపి సింబల్ కానీ జెండా కానీ ఎక్కడా ఉపయోగించలేదు కాబట్టి ఇక అబ్జెక్షన్ చేయడానికి ఏమి లేదు.ఇప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్ 29న విడుదల కావడానికి అన్ని రూట్లు క్లియర్ అయినట్టే. మధ్యంతరంగా ఏవైనా కోర్టు ఉత్తర్వులు వస్తే తప్ప అడ్డుకోవడం జరగని పని.
అయితే ఈ శుక్రవారమే వస్తుందా లేక ఇంకొంత జాప్యం ఉంటుందా అనే క్లారిటీ లేదు. వర్మ మాత్రం నొక్కి నొక్కి ఇదే డేట్ చెబుతున్నాడు. జరిగిన పరిణామం టిడిపికి ఏ మాత్రం మింగుడుపడనిదే. చంద్రబాబును నెగటివ్ గా చూపించారన్న వాదన ఎన్నికల కమీషన్ లో నిలవకపోవడంతో ఉన్న నాలుగు రోజుల సమయంలో ఏం చేయాలన్న నిర్ణయానికి రావడం కష్టమే. సో వర్మ ఫ్యాన్స్ తో మూవీ లవర్స్ కూడా ఎదురు చూస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ కు దారి దొరికేసింది