Begin typing your search above and press return to search.

కాపీ ఆరోపణలపై స్పందించిన 'ఆచార్య' మేకర్స్...!

By:  Tupaki Desk   |   27 Aug 2020 1:00 PM GMT
కాపీ ఆరోపణలపై స్పందించిన ఆచార్య మేకర్స్...!
X
మెగాస్టార్ చిరంజీవి - కొరటాల శివ కాంబినేషన్‌ లో ''ఆచార్య'' అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా 'ఆచార్య' మోషన్ పోస్టర్ విడుదల చేశారు. ఆ మోషన్ పోస్టర్ చూసి కన్నెగంటి అనిల్ కృష్ణ అనే రచయిత ఈ సినిమా కథ తనదేనంటూ ఆరోపణలు చేశారు. 2006లో 'పుణ్యభూమి' అనే టైటిల్‌ తో తాను ఓ కథను రిజిస్ట్రేషన్ చేయించానని.. మోషన్ పోస్టర్‌ లో కనిపిస్తున్న 'ధర్మస్థలి' అనే ఎపిసోడ్‌ తన స్క్రిప్ట్‌ నుంచి ప్రేరణ పొందారని అనిల్ కృష్ణ పేర్కొన్నారు. ఇదే క్రమంలో 'ఆచార్య' కథ తనదేనంటూ మరో రచయిత ముందుకొచ్చారు. బి గోపాల్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన రాజేష్ మండూరి అనే రచయిత.. తాను రాసుకున్న కథని రెండేళ్ల క్రితం మైత్రీ మూవీ మేకర్స్ వారికి వినిపించానని.. ఇప్పుడు అదే స్టోరీతో మైత్రీ మూవీ మేకర్స్ తో సన్నిహితంగా ఉండే కొరటాల శివ సినిమా చేస్తున్నాడని మీడియా వేదికగా ఆరోపించాడు.

కాగా తాజాగా కాపీ ఆరోపణలపై 'ఆచార్య' మేకర్స్ స్పందించారు. 'ఆచార్య' నిర్మాతల్లో ఒకరైన మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ వారు దీనిపై ప్రెష్ నోట్ రిలీజ్ చేసారు. 'ఆచార్య' కొరటాల శివ రాసిన ఒరిజినల్ స్టోరీ అని.. ఈ కాపీ అంటూ వస్తున్నవన్నీ బేస్ లెస్ ఆరోపణలని పేర్కొన్నారు. ''ఇటీవల విడుదలైన 'ఆచార్య' టైటిల్ లుక్ మోషన్ పోస్టర్ మంచి దక్కించుకుంది. భారీ రెస్పాన్స్ తో 'ఆచార్య' పై హైప్ క్రియేట్ అవడంతో ఇద్దరు రచయితలు ఈ స్టోరీ అంటూ అసత్య ఆరోపణలు చేస్తున్నారు. కేవలం టైటిల్ పోస్టర్ చూసి ఈ స్టోరీ తమదే అంటూ ఆరోణలు చేయడం హాస్యాస్పదం. ఇది ఒరిజినల్ స్టోరీ అని స్పష్టం చేస్తున్నాం. కొరటాల శివ వంటి ఫిలిం మేకర్ పై ఇలాంటి ఆరోపణలను మేము ఖండిస్తున్నాం. ఆచార్య స్టోరీ అంటూ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలో వస్తున్న రూమర్స్ ని బేస్ చేసుకొని వారు ఈ స్టోరీ తమదే అంటూ ఆరోపణలు చేస్తున్నట్లున్నారు. ఇవన్నీ అసత్య బేస్ లెస్ ఆరోపణలు. 'ఆచార్య' ఒక ప్రతిష్టాత్మకమైన చిత్రం. కొణిదెల ప్రొడక్షన్ సమర్పణలో మ్యాట్నీ ఎంటెర్టైన్మెంట్ నిర్మిస్తోంది. ఈ సినిమా కోసం అందరం ఆసక్తిగా వెయిట్ చేస్తున్నాం. వీలైనంత త్వరగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం'' అని పేర్కొన్నారు.