Begin typing your search above and press return to search.
1 మిలియన్ డాలర్ క్లబ్ లో చేరిన బేబీ అక్కినేని
By: Tupaki Desk | 24 July 2019 10:06 AM GMTనందిని రెడ్డి దర్శకత్వంలో సమంతా అక్కినేని ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'ఓ బేబీ'. జులై 5 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలై మూడు వారాలు అయినా ఇంకా ఈ సినిమా థియేటర్లలో ప్రదర్శితమవుతూ ప్రేక్షకులను మెప్పిస్తోంది. ఈ సినిమాలో సమంతా నటనకు ప్రేక్షకులతో పాటుగా విమర్శకులు కూడా జేజేలు పలికారు. తాజాగా ఈ సినిమా అమెరికాలో మరో ఘనత సాధించింది.
అమెరికాలో ఈ సినిమా కలెక్షన్స్ తాజాగా వన్ మిలియన్ డాలర్ మార్క్ ను దాటాయి. ఈ సందర్భంగా 'ఓ బేబీ' టీమ్ ఒక కొత్త పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ ను సమంతా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా పోస్ట్ చేసింది. ఈ పోస్టర్ లో 1 మిలియన్ డాలర్ సంఖ్యపై సమంతా క్వీన్ బీ లాగా కూర్చొని చిరునవ్వులు చిందిస్తూ ఉంది. సైడ్ లో సమంతా సంతోషంగా రెడ్ డ్రెస్ లో స్టెప్పులు వేస్తూ ఉంది. సమంతాకు వన్ మిలియన్ డాలర్ క్లబ్ లో ఎంటర్ అయిన సినిమాలు చాలానే ఉన్నాయి కానీ ఇది మాత్రం ప్రత్యేకం. ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించింది సమంతానే కాబట్టి ఇది స్పెషల్.
ఈ సినిమా విజయంతో ఓవర్సీస్ లో సమంతా స్టార్ హీరోలతో సమానంగా క్రౌడ్ పుల్లింగ్ స్టార్ అని నిరూపించుకుంది. సమంతా హీరోయిన్ గా నటించిన లాస్ట్ సినిమా 'మజిలీ' కూడా అమెరికాలో ఈ చిత్రాన్ని అమెరికాలో రెడ్ హార్ట్ మూవీస్ వారు విడుదల చేశారు. వన్ మిలియన్ డాలర్ మార్క్ టచ్ చేయడం వారిని సంతోషపెట్టేదే.