Begin typing your search above and press return to search.
సీతా రామంలోని బ్యూటిఫుల్ మెలోడీ.. 'ఓ సీత హే రామ'..!
By: Tupaki Desk | 9 May 2022 8:30 AM GMTమలయాళ హీరో దుల్కర్ సల్మాన్ - గార్జియస్ బ్యూటీ మృణాళ్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ''సీతా రామం''. ‘యుద్ధంతో రాసిన ప్రేమకథ’ అనేది దీనికి ట్యాగ్ లైన్. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా బ్యానర్ పై అశ్విని దత్ - ప్రియాంక దత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
యుద్ధ నేపథ్యంలో అందమైన ప్రేమకథగా రూపొందుతోన్న ఈ చిత్రంలో రామాగా దుల్కర్.. సీతగా మృణాల్ కనిపించనున్నారు. ఇందులో ఆఫ్రిన్ అనే కీలకమైన పాత్రలో రష్మిక మందన్న నటించింది. సుమంత్ - గౌతమ్ మీనన్ - ప్రకాష్ రాజ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఇప్పటికే విడుదల చేసిన 'సీతా రామం' టైటిల్ గ్లింప్స్ మరియు ఇతర ప్రచార చిత్రాలకు మంచి స్పందన వచ్చింది. ఈ క్రమంలో మ్యూజికల్ ప్రమోషన్స్ లో భాగంగా ఈరోజు సోమవారం సినిమా నుండి ‘ఓ సీత హే రామ’ అనే ఫస్ట్ సింగిల్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
'ఓ సీతా వదలనిక తోడవుతా.. రోజంతా వెలుగుళిడు నీడవుతా.. దారై నడిపైనే చేతి గీత.. చేయి విడువకా సాగుతా..' అంటూ సాగిన ఈ గీతం సంగీత ప్రియులను అలరిస్తోంది. విశాల్ చంద్రశేఖర్ ఈ బ్యూటీఫుల్ మెలోడియస్ ట్యూన్ ను కంపోజ్ చేశారు.
హీరోహీరోయిన్లు తమ మధ్య ఉన్న ప్రేమను వ్యక్త పరిచే విధానాన్ని గీత రచయిత అనంత శ్రీరామ్ తన సాహిత్యంతో అందంగా వివరించారు. ఎస్పీ చరణ్ - రమ్య బెహరా కలిసి ఈ పాటను ఆలపించారు. ఇది ఇళయరాజా-ఎస్పీబీ కలయికలో వచ్చిన అలనాటి పాటలను గుర్తు చేస్తోంది.
‘ఓ సీత హే రామ’ పాట విజువల్ గానూ అద్భుతంగా ఉంది. ఇందులో దుల్కర్ మరియు మృణాల్ మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. స్క్రీన్ పై ఇద్దరి జంట ఫ్రెష్ గా ఉంది.. అలానే చాలా అందంగా కనిపించారు.
పీఎస్ వినోద్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించగా.. సునీల్ బాబు ప్రొడక్షన్ డిజైనింగ్ చేశారు. వైష్ణవి రెడ్డి - అలీ థాట్స్ ఆర్ట్ డైరెక్టర్స్ గా వ్యవహరించారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
''సీతా రామం'' సినిమా తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో ఈ సినిమా నుంచి మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ రానున్నాయి.