Begin typing your search above and press return to search.
ట్రైలర్ టాక్: బంగారంలో గ్లామర్ డోస్
By: Tupaki Desk | 12 Dec 2016 8:01 AM GMTచాలా రోజుల నుండి కేవలం ఫ్లాపులే కొడుతున్న మణిరత్నం ఎట్టకేలకు ''ఓకె బంగారం''తో బయటపడ్డాడు. ముఖ్యంగా ఆ సినిమాలోని కంటెంట్.. అలాగే పిసి శ్రీరాం కెమెరా వర్క్.. ఏ.ఆర్.రెహ్మాన్ పాటలు.. అన్నీ అదిరిపోయాయ్. అందుకే సినిమాకు ఎనలేని గుడ్ నేమ్ వచ్చేసింది. ఈ సినిమాను ఇప్పుడు షాద్ ఆలీ డైరక్షన్లో హిందీలో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే.
అద్భుతమైన ఫోటోగ్రాఫి.. రెహ్మాన్ సంగీతం.. అవే సీన్లు డైలాగులూ.. ప్రకాష్ రాజ్ పాత్రలో నసీరుద్దీన్ షా.. బాగానే ఉన్నాయి. కాకపోతే ఈ సినిమా ట్రైలర్ చూశాక అర్ధమయ్యే ఒక విషయం ఏంటంటే.. సినిమాలో మనోళ్ళు హీరో ఆదిత్య కపూర్ అలాగే హీరోయిన్ శ్రద్దా కపూర్ మధ్యన కాస్త ఘాటైన రిలేషనే సెట్ చేశారు. తెలుగు వర్షన్ లో నిత్యా మీనన్ సైడ్ నుండి పెద్దగా గ్లామర్ డోస్ ఏమీ లేకపోయినా కూడా.. ఈ హిందీ వర్షన్ లో మాత్రం శ్రద్దా చాలా శ్రద్దగా తన స్టీమీ లుక్ ఆరబోసింది. బాలీవుడ్ రీమేక్ అంటే ఆ మేరకు డోస్ ఉండాలని అనుకున్నారేమో.
అయితే హిందీ వర్షన్ కూడా చూస్తుంటే బాగానే ఆడేసేలా ఉంది. పైగా ఈ కపుల్ గతంలో ఆషికీ 2 సినిమాతో ఆకట్టుకున్నారు కాబట్టి.. ఇప్పుడు ఖచ్చితంగా ఆ ప్రభావంతో యూత్ అంతా జనవరి 13న ధియేటర్లకు పరిగెత్తేసే ఛాన్సుందిలే. అది సంగతి.