Begin typing your search above and press return to search.

హమ్మ హమ్మా.. సెక్సీగా కొట్టారమ్మా!!

By:  Tupaki Desk   |   15 Dec 2016 4:08 PM GMT
హమ్మ హమ్మా.. సెక్సీగా కొట్టారమ్మా!!
X
లెజండరీ డైరక్టర్ మణిరత్నం తీసిన మూవీ.. క్లాసిక్ హిట్ ''బొంబాయి''లో.. 'హమ్మ హమ్మ' సాంగ్ ఏ రేంజ్ లో సక్సెస్ అని చెప్పడానికి మాటలు చాలవు. ఏ.ఆర్.రెహ్మాన్ కంపోజ్ చేసిన ఈ పాటకు బోలెడంత క్రేజ్ ఉంది. ఎవర్ గ్రీన్ సాంగ్ అనే చెప్పాలి. అదే పాటను ఇప్పుడు రీమిక్స్ చేస్తే ఎలా ఉంటుంది.. ఆ కిక్కే వేరబ్బా అనాల్సిందే. పైగా అందులోకి కత్తిలాంటి అందాలను జొప్పిస్తే ఎలా ఉంటుంది? అదే పని చేశారు.

ఓకే బంగారంకు హిందీ రీమేక్ గా తెరకెక్కుతున్న 'ఓకే జాను' మూవీకోసం హమ్మహమ్మ సాంగ్ ను రీమిక్స్ చేశారు. రెహమాన్ క్రియేట్ చేసిన ఈ ఒరిజినల్ ను.. బాద్షా అండ్ తనీష్క్ బాగ్చి కలసి రీమిక్స్ చేశారు. ఆదిత్య రాయ్ కపూ్-శ్రద్ధా కపూర్ ల మీద ఒక హాట్ సాంగ్ గా దీనిని చిత్రీకరించారు. సినిమా తెలుగు వెర్షన్ లో వీరు వేరే ఊరెళ్ళి ఒక రూమ్ అద్దెకు తీసుకునే సీన్లో ఒక పాట వస్తుంది. ఆ పాట ప్లేసులో ఇప్పుడు హమ్మ హమ్మ రీమిక్స్ ను వాడేశారు. తెలుగు వర్షన్ లో నిత్యా మీనన్ పెద్దగా గ్లామర్ జొప్పించలేదు కాని.. హిందీలో మాత్రం శ్రద్దా కపూర్ చాలా హాటుగానే అదరగొట్టేసింది. గ్లామరసం దారబోసేసింది.

అయితే.. ఓకే బంగారంకు మణిరత్నం దర్శకుడు అయినా.. హిందీ రీమేక్ కు ఆయన కాకపోవడం.. హమ్మ హమ్మ రీమిక్స్ కు విజువల్ గా పూర్తి న్యాయం చేయలేదనే అనిపిస్తుంది. పైగా బొంబాయి సినిమాలో హమ్మ హమ్మా అనేది హీరో-హీరోయిన్ ఫస్ట్ నైట్లో వచ్చే ఒక రొమాంటికి రోమాంచిత గీతం. ఇక్కడేమో అప్పటికి ఇంకా ప్రేమలో పూర్తిగా పడని ఇద్దరి మధ్యన జరిగే సన్నివేశం. మ్యాచ్ అవుతందంటారా? కాకపోతే పాటను మాత్రం గతంలో కంటే సెక్సీగానే కొట్టారనే చెప్పాలి. ఇకపోతే 1995లో వచ్చిన ''బొంబాయి'' సినిమాలోని ఈ పాటతో.. తొలిసారి వెండితెరకు ఎక్కింది అప్పటి 'లిరిల్' మోడల్ సోనాలి బింద్రే.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/