Begin typing your search above and press return to search.

ఈ ఫెస్టివల్‌ కి మన సినిమాలు వెళ్లవా?

By:  Tupaki Desk   |   28 Aug 2015 9:40 AM GMT
ఈ ఫెస్టివల్‌ కి మన సినిమాలు వెళ్లవా?
X
ఓ కాదల్‌ కణ్మని (ఓకే బంగారం) .. మణిరత్నం దర్శకత్వం వహించిన సినిమా ఇది. పెళ్లికి ముందే సహజీవనం అనే కాన్సెప్టుతో తెరకెక్కి తమిళ్‌, తెలుగు రెండు చోట్లా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అయ్యింది. ఒక అందమైన కాన్సెప్టుని అంతే అందంగా, హృద్యంగా వెండితెరపై ఆవిష్కరించిన దర్శకుడిగా మణిరత్నంకి పేరొచ్చింది.

మణి సర్‌ ఈజ్‌ బ్యాక్‌ ఎగైన్‌. అందుకే ఈ సినిమా 'కేన్స్‌ ఆప్‌ ఏసియా'గా పిలవబడే భూషణ్‌ ఇంటర్నేషనల్‌ ఫిలింఫెస్ట్‌ కి ఎంపికైంది. అక్టోబర్‌ 1 నుంచి 10వరకూ ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఇదే వేడుకల్లో విజయ్‌ సేతుపతి హీరోగా బిజు విశ్వంత్‌ దర్శకత్వం వహించిన 'ఆరెంజ్‌ మిఠాయ్‌' అనే చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. తమిళ్‌ నుంచే రెండు సినిమాలు వెళ్లాయి. కానీ తెలుగు నుంచి ఇలాంటి ప్రయత్నం జరిగినట్టే కనిపించడం లేదు.

అంతర్జాతీయ సినిమా ఉత్సవాలకు పంపించేంతటి సత్తా ఉన్న సినిమాలు మనవాళ్లు తీయలేకపోతున్నారా? లేక ఇంకేదైనా లోపమా? కమర్షియల్‌ హంగుల్లో పడి అసలు సినిమాని మర్చిపోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని అనుకోవాలా? అవార్డులెందుకు డబ్బులొస్తే చాలదూ.. అంటారా? మన ఫిలింమేకర్స్‌ నుంచి సమాధానం ఉంటుందా?