Begin typing your search above and press return to search.

హీరో సందీప్‌ అవమానించినట్లేనా??

By:  Tupaki Desk   |   6 Jun 2016 4:48 AM GMT
హీరో సందీప్‌ అవమానించినట్లేనా??
X
సందీప్ కిషన్ - నిత్యామీనన్ లు జంటగా నటించిన రొమాంటిక్ థ్రిల్లర్ 'ఒక అమ్మాయి తప్ప' టైటిల్ తోనే ఆడియన్స్ ను ఆకట్టుకున్న మాట వాస్తవమే. ఇప్పటివరకూ ఈ సినిమా టైటిల్ చాలా క్యూట్ గా ఉందని ప్రశంసలు రాగా.. ఇప్పుడిదే టైటిల్ వివాదంలో ఇరుక్కుపోయింది. దీనికి కారణం టైటిల్ కి ముందు తగిలించిన ట్యాగ్ లైన్.

'ఆల్ ఇండియన్స్ ఆర్ మై మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్'.. ఒక అమ్మాయి తప్ప.. ట్యాగ్ లైన్ తో కలిపి ఈ మూవీ టైటిల్ పూర్తి రూపం ఇది. 'భారత దేశం నా మాతృభూమి - భారతీయులందరు నా సహోదరులు' అంటూ దేశ ప్రజలు చేసే ప్రతిజ్ఞలోని మొదటి లైన్ ను పట్టుకొచ్చేసి.. టైటిల్ కి తగిలించేసుకున్నారు. ఈ వర్డింగ్ ను సరదాగా రియల్ లైఫ్ చాలామందే ఉపయోగిస్తారు. కానీ సినిమాకి వాడడం మాత్రం నేషనల్ ప్లెడ్జ్ ను చేయడమే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అసలు ఇలాంటి టైటిల్ కి ఫిలిం ఛాంబర్ ఎలా అప్రూవల్ ఇచ్చిందనే క్వశ్చన్ కూడా రైజ్ అవుతోంది.

అయితే.. కేవలం 'ఒక అమ్మాయి తప్ప' అనే టైటిల్ ను మాత్రమే తమ దగ్గర రిజిస్ట్రేషన్ చేయించారని ఫిలిం ఛాంబర్ వర్గాలు అంటున్నాయి. ట్యాగ్ లైన్ తమ నియంత్రణలో ఉండదని చెబుతూ.. సెన్సార్ సర్టిఫికేట్ ఇంకా ఇవ్వలేదు కాబట్టి.. ఈ ఇష్యూను సీరియస్ గా తీసుకుంటామని అంటున్నాయి. నిర్మాతతో కూడా మాట్లాడి ట్యాగ్ లైన్ విషయంలో హెచ్చరిస్తామని అంటున్నారు. టైటిల్ చాలాక్యూట్ అండ్ రొమాంటిక్ గా ఉందని అనుకుంటున్న టైంలో.. సినిమాని ఇలా చిక్కుల్లో పెట్టుకోవడం ఎందుకో మూవీ యూనిట్ కే తెలియాలి.