Begin typing your search above and press return to search.

ఇక్కడ ఆడలేదు.. తమిళంలోకి తీసుకెళ్తున్నారు

By:  Tupaki Desk   |   14 Aug 2016 5:30 PM GMT
ఇక్కడ ఆడలేదు.. తమిళంలోకి తీసుకెళ్తున్నారు
X
అదేం చిత్రమో.. ఒక భాషలో ఆడని సినిమాల్ని కూడా ఇంకో భాషలోకి అనువాదం చేసేస్తుంటారు జనాలు. ఇది ఎక్కువగా తమిళం నుంచి తెలుగులోకి వచ్చే అనువాద చిత్రాల విషయంలో జరుగుతూ ఉంటుంది. ఐతే ఈ మధ్య తెలుగు సినిమాల్ని కూడా తమిళంలోకి తెగ అనువదించేస్తున్నారు. అవి దారుణమైన ఫలితాల్ని అందుకుంటున్నాయి. తాజాగా నాగచైతన్య సినిమా ‘ఒక లైలా కోసం’ను తమిళంలోకి ‘లైలా ఓ లైలా’ పేరుతో అనువాదం చేస్తున్నారు. 2014లో విడుదలైన ఒక లైలా కోసం పెద్దగా ఆడలేదు. మంచి అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా సోసోగా ఆడి.. యావరేజ్ అనిపించుకుంది.

ఐతే చైతూకి తమిళంలో మార్కెట్ ఏమీ లేకపోయినా.. ఈ సినిమాను ఓ నిర్మాత అనువాదం చేసి రిలీజ్ చేస్తున్నాడు. ‘ఒక లైలా కోసం’ హీరోయిన్ పూజా హెగ్డే తమిళ ప్రేక్షకులకు పరిచయమే. జీవా సరసన ముగమూడి (తెలుగులో మాస్క్) అనే సినిమా చేసిందామె. అది పెద్ద ఫ్లాప్. ఇక సినిమాలో నటించిన మిగతా నటీనటులు తమిళ ప్రేక్షకులకు అంత పరిచయమేమీ లేదు. కాన్సెప్ట్ ఏమైనా వెరైటీగా ఉంటుందా అంటే అదీ లేదు. ఇక్కడ సరిగా ఆడని.. ఓ మామూలు సినిమాను తమిళంలోకి అనువాదం చేసి ఏం ప్రయోజనమే. బ్రూస్ లీ.. బ్రహ్మోత్సవం.. లాంటి భారీ సినిమాలే తమిళంలోకి అనువాదమై చేదు అనుభవాన్ని మూటగట్టుకున్నాయి. లేటెస్టుగా ‘బాబు బంగారం’ సినిమాకూ అలాంటి ఫలితమే ఎదురైంది. మరి ‘ఒక లైలా కోసం’కు ఎలాంటి ఫలితం వస్తుందో చూడాతలి.