Begin typing your search above and press return to search.

మనస్సులో నుండి 14 నిమిషాలు కట్‌

By:  Tupaki Desk   |   24 Jun 2016 2:19 PM GMT
మనస్సులో నుండి 14 నిమిషాలు కట్‌
X
ఈ మధ్యన చాలాసార్లు ఏదైనా సినిమా రిలీజ్ అయ్యాకనే దర్శకనిర్మాతలు కత్తెరలు పట్టుకుని పరిగెడుతున్నారు. మొన్నామధ్యన సర్దార్‌ అండ్‌ బ్రహ్మోత్సవం విషయంలో కూ అలాగే జరిగింది. ఇప్పుడు మరో సినిమా విషయంలో అదే జరుగుతోంది.

''ఒక మనసు''. మెగా డాటర్‌ నిహారిక తొలి పరిచయం అయ్యింది ఈ సినిమాలో. అయితే సినిమా బాగా పోయెటిక్‌ గా బరువుగా ఉన్నప్పటికీ.. సినిమా మొదటి హాఫ్‌ కాస్త స్లో గా ఉండటమే కాదు.. కాస్త లెంగ్త్ ఎక్కువగా ఉందనే టాక్‌ కూడా వినిపిస్తోంది. వెంటనే ఈ విషయం రియలైజ్ అయిన ''ఒక మనసు'' ప్రొడ్యూసర్ మధుర శ్రీధర్‌.. ఇప్పుడు సినిమా మొదటి హాఫ్‌ లో 14 నిమిషాలు కత్తెరిస్తున్నారని తెలుస్తోంది. రేపటి నుండి ప్రదర్శితమయ్యే అన్ని షోలు కూడా 14 నిమిషాలు నిడివిని తక్కువగా ప్రదర్శిస్తాయి.

ఇకపోతే సినిమా క్లాస్‌ ఆడియన్స్ కు బాగా ఎక్కుతోందని.. అల్రెడీ ప్రేమలో విఫలం చెందినవారు.. ప్రేమలో ఇటువంటి సంఘర్షణలే ఎదుర్కొంటున్న వారు సినిమాను బాగా లైక్‌ చేస్తున్నారని అంటున్నారు విమర్శకులు. మేకింగ్ వాల్యూస్ బాగా ఉండటంతో నిర్మాతకు మాంచి టేస్ట్ ఉందనే టాక్‌ కూడా వినిపిస్తోందిలే.