Begin typing your search above and press return to search.

పవన్ తో పోటీకి దిగుతున్న నీహారిక..

By:  Tupaki Desk   |   16 Feb 2016 11:30 AM GMT
పవన్ తో పోటీకి దిగుతున్న నీహారిక..
X
కొణిదెల వారసురాలు నీహారిక తన పంతం నెగ్గించుకుని హీరోయిన్ గా సినిమా చేసేస్తోంది. ముందు కొంత వ్యతిరేకత వచ్చినా, చివరకు మొత్తం మెగా టీం అంతా ఆశీర్వాదంతో ఒక మనసు చిత్రంలో హీరోయిన్ రోల్ చేస్తోంది. నాగబాబు కూతురు అరంగేట్ర సినిమాపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి.

ఇలా ఎన్నో ఉంచనాలు తారలు.. తమ లాంఛింగ్ మూవీని సేఫ్ జోన్ లో ఉండేలా రిలీజ్ చేసేందుకు సిద్దమవుతారు. కానీ ఆశ్చర్యకరంగా నీహారిక నటించిన సినిమాని పోటీలో విడుదల చేయాలని చూస్తున్నారు. ఆ పోటీ కూడా వేరే ఎవరితోనో కాదు. ఏకంగా బాబాయ్ పవన్ కళ్యాణ్ మూవీతోనే. పవర్ స్టార్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ మూవీ ఏప్రిల్ 8న రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకుంది. అల్లు అర్జున్ మూవీ సరైనోడు చిత్రాన్ని కూడా ముందు ఇదే డేట్ కి తేవాలని అనుకున్నారు. కానీ రెండు యూనిట్ల మధ్య జరిగిన చర్చల తర్వాత.. బన్నీ మూవీ వెనక్కి తగ్గేందుకు సిద్ధమైంది. ఒక పోటీ తగ్గిందని అనుకుంటున్న సమయంలోనే.. ఇప్పుడు సడెన్ గా బాబాయ్ తో పోటీకి నీహారిక సినిమాని తెస్తుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

నాగశౌర్య హీరోగా, రామ రాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఒక మనసు చిత్రం ఇప్పుడు ఇలాంటి సెన్సేషన్ తో వార్తల్లో నిలుస్తోంది. మార్చ్ ప్రారంభంలో జరగనున్న ఒక మనసు ఆడియో వేడుకకు చిరు - పవన్ సహా మొత్తం మెగా ఫ్యామిలీ హాజరవుతుందని అంటున్నారు. ఈలోపలే ఈ పోటీ సంగతి కూడా తేలిపోవచ్చు.