Begin typing your search above and press return to search.

'ఒకే ఒక జీవితం' ప్రీమియర్ టాక్..!

By:  Tupaki Desk   |   9 Sep 2022 4:48 AM GMT
ఒకే ఒక జీవితం ప్రీమియర్ టాక్..!
X
వర్సటైల్ హీరో శర్వానంద్ నటించిన లేటెస్ట్ మూవీ "ఒకే ఒక జీవితం". శ్రీ కార్తిక్ అనే కొత్త దర్శకుడు తెలుగు తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్.ఆర్ ప్రకాశ్ బాబు - ఎస్.ఆర్ ప్రభు నిర్మించారు. ఇందులో అమల అక్కినేని - రీతూ వర్మ - వెన్నెల కిషోర్ - ప్రియదర్శి - నాజర్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.

ప్రమోషనల్ కంటెంట్ తోనే అందరి దృష్టిని ఆకర్షించిన 'ఒకే ఒక జీవితం' సినిమా.. మరికొన్ని గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతోంది. అయితే అంతకంటే ముందుగానే యూఎస్ఏతో పాటుగా పలు ఏరియాల్లో ప్రీమియర్ షోలు ప్రదర్శించబడ్డాయి. శర్వా కెరీర్ లో మైలురాయి 30వ చిత్రానికి ప్రీమియర్స్ నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది.

'ఒకే ఒక జీవితం' అనేది టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో రూపొందించిన ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. ఓ ప్రమాదం కారణంగా చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన ఓ యువకుడు.. టైం మెషిన్ సహాయంతో గతంలోకి వెళ్లి తన తల్లిని కలుసుకొని.. ఒకప్పుడు జరిగిన తప్పులను సరిచేయాలని ప్రయత్నించడమే ఈ సినిమా కథ.

టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌ ని సెంటిమెంట్‌ తో బాగా మిళితం చేసి ఎమోషనల్ హార్ట్ టచింగ్ మూవీని రూపొందించాడు దర్శకుడు శ్రీ కార్తీక్. మంచి కథ రాసుకోవడమే కాదు.. దాన్ని అదే విధంగా ఎగ్జిక్యూట్ చేయడంలో కొత్త డైరెక్టర్ సఫలం అయ్యాడు. ఎమోషన్స్ - కామెడీని సమపాళ్లలో అందించడమే కాదు.. సస్పెన్స్ ఎలిమెంట్ కూడా బాగా ఆకట్టుకుంటుంది.

ఇంటర్వెల్‌ లో థ్రిల్లింగ్ ట్విస్ట్‌ తో ఫస్ట్ హాఫ్‌ చాలా బాగా అనిపిస్తుంది. గతానికి, వర్తమానానికి మధ్య ఉన్న అనుబంధాన్ని చాలా బాగా చూపించారు. ప్రధాన నటీనటుల అత్యుత్తమ ప్రదర్శనలు - ఎమోషనల్ క్లైమాక్స్‌ తో సెకండాఫ్ కూడా విశేషంగా ఆకట్టుకుంటుంది.

శర్వానంద్ స్టేజ్ ఫియర్ ఉన్న స్ట్రగులింగ్ సింగర్ గా.. తల్లి కోసం ఆరాట పడే యువకుడిగా మంచి నటన కనబరిచాడు. దశాబ్దం తర్వాత తెలుగు సినిమాలో నటించిన అమల అక్కినేని.. శర్వా తల్లిగా అద్భుతంగా నటించింది. వెన్నెల కిషోర్ - ప్రియదర్శి తమ పాత్రలను సమర్ధవంతంగా పోషించారు.

ముఖ్యంగా సెకండాఫ్ మరియు క్లైమాక్స్‌ లో పిల్లల పెర్ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. తరుణ్ భాస్కర్ అందించిన డైలాగ్స్ చాలా ప్లస్ అయ్యాయి. జేక్స్ బిజోయ్ సమకూర్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. అయితే సెకండాఫ్‌ లో ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త శ్రద్ధ పెడితే బాగుండు అనిపిస్తుంది.

ఓవరాల్‌ గా, 'ఒకే ఒక జీవితం' అనేది మంచి పాయింట్ తో అద్భుతమైన ప్రదర్శనలతో నూతన దర్శకుడు శ్రీ కార్తీక్ నీట్ గా ఎగ్జిక్యూట్ చేసిన టైం ట్రావెల్ మూవీ. శర్వానంద్ చేసిన ఈ టైమ్ ట్రావెల్ సక్సెస్ ఫుల్ గా సాగిందని చెప్పాలి. సినిమా కంప్లీట్ రివ్యూ కోసం 'తుపాకీ డాట్ కామ్' చూడండి..!


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.