Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: మనోజ్ 'ఒక్కడు మిగిలాడు'

By:  Tupaki Desk   |   19 Aug 2017 11:37 AM IST
ట్రైలర్ టాక్: మనోజ్ ఒక్కడు మిగిలాడు
X
మంచు మనోజ్ చాలా రోజుల నుండి హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ మధ్య కాలంలో వచ్చిన అతగాడి సినిమాలేవీ హిట్ బాటలో పట్టలేదు. అందుకే ఇప్పుడు కొత్తగా ప్రయత్నిస్తూ ''ఒక్కడు మిగిలాడు'' అనే సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమాలో మనోడు డ్యుయల్ రోల్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఎల్.టి.టి.ఇ తరహా మిలిటెంట్ గ్రూపు అధినేతగా ఒకవైపు.. ఒక సామాన్య విద్యార్దిగా మరోవైపు కనిపిస్తున్నాడు.

ఇప్పుడు రిలీజ్ అయిన కొత్త ట్రైలర్ ప్రకారం కథ ఏంటంటే.. ఈ సినిమాలో మంచు మనోజ్ ఒకవైపు బడుగు బలహీన వర్గాలకోసం పోరాడుతూ ఉంటాడు. 'ఒకవేళ భగత్ సింగ్ వంటి వారు ఇప్పుడు కూడా స్వాతంత్ర్యం కోసం పోరాడుతుంటే.. వారిని తీవ్రవాదులు అంటామా? స్వాతంత్ర్య సమరయోధులు అంటామా?' అనే థీమ్ తో వస్తున్నాడు. మరోవైపు దేశంలో ఆడవాళ్లపై జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా మరో మనోజ్ పోరాడుతూ ఉంటాడు. ఇందులో మనోడు డ్యుయల్ రోల్స్ లో బాగానే మెప్పించాడు. ఒకవైపు మిలిటెన్సీ.. మరోవైపు స్ర్తీ రక్షణ అంశాలను టచ్ చేస్తే.. ఏదో సోషల్ మెసేజ్ ఓరియెంటడ్ సినిమాను తీశాడు దర్శకుడు అజయ్ ఆండ్రూస్ నూతక్కి. అక్కడక్కడా వచ్చిన గ్రాఫిక్స్ పేలవంగా ఉన్నాయి కాని.. ట్రైలర్ బాగానే ఉంది.

ఇప్పటివరకు ఎక్కువగా ఎంటర్టయిన్మెంట్ కథలను నమ్ముకున్న మనోజ్ ఒక్కసారిగా రూటు మార్చి ఎందుకు ఇంత సీరియస్ టాపిక్ తీసుకున్నాడో తెలియదు కాని.. సెప్టెంబర్ 8న రానున్న ఈ సినిమాతో మాత్రం యాక్టర్ గా ప్రూవ్ చేసుకుందాం అనుకుంటున్నట్లున్నాడు. లెటజ్ సీ!!