Begin typing your search above and press return to search.

ఖుషి కథ ముగిసింది.. ఒక్కడు టైం వచ్చింది..!

By:  Tupaki Desk   |   5 Jan 2023 5:30 AM GMT
ఖుషి కథ ముగిసింది.. ఒక్కడు టైం వచ్చింది..!
X
ప్రస్తుతం ఏం నడుస్తుంది అంటే ఫాగ్ నడుస్తుంది అని సెంట్ యాడ్ వచ్చినట్టుగా ప్రస్తుతం టాలీవుడ్ లో ఏం నడుస్తుంది అంటే రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తుందని చెప్పొచ్చు. మహేష్ పోకిరితో మొదలైన ఈ రీ రిలీజ్ హంగామా న్యూ ఇయర్ కి పవర్ స్టార్ ఖుషి వరకు కొనసాగుతూనే ఉంది. ఖుషి సినిమా రెండు రోజుల ఆటతో దాదాపు 5 కోట్ల షేర్ రాబట్టిందని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ మాస్ ఫ్యానిజం ఏంటో మరోసారి ఈ సినిమా వసూళ్లు చూపించాయి.

సూర్య మూవీస్ బ్యానర్ లో ఏ.ఎం రత్నం నిర్మించిన ఖుషి రీ రిలీజ్ కి నిర్మాత కూడా సపోర్ట్ అందించారు. సినిమా రిలీజ్ విషయంలో రీ రిలీజ్ అని కాకుండా ఫస్ట్ టైం రిలీజ్ అనే రేంజ్ లో శ్రద్ధ తీసుకున్నారని తెలుస్తుంది. ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్ అయిన ఏ.ఎం రత్నం తన సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. క్రేజీ కాంబినేషన్స్, భారీ బడ్జెట్ సినిమాలు ఏ.ఎం. రత్నం తీశారు. ఖుషి రీ రిలీజ్ టైం లోనే ఆయన పవన్ కళ్యాణ్ తో ప్రస్తుతం హరి హర వీరమల్లు సినిమా చేస్తుండటం కూడా విశేషంగా చెప్పుకోవచ్చు.

ఇక ఖుషి కథ ముగిసింది. జనవరి 7న మరో సూపర్ హిట్ సినిమా రీ రిలీజ్ చేస్తున్నారు. అదే సూపర్ స్టార్ మహేష్ ఒక్కడు. ఆ సినిమాకు నిర్మాత ఎమ్మెస్ రాజు. ఒకప్పుడు ఆయన బ్యానర్ లో సినిమా అంటే చాలు పక్కా సూపర్ హిట్ అనే ఒక బ్రాండ్ ఉండేది.

గుణశేఖర్ డైరెక్షన్ లో వచ్చిన ఒక్కడు సినిమా టాలీవుడ్ సూపర్ హిట్ క్లాసిక్స్ లో ఒకటిగా చెప్పొచ్చు. మహేష్ కి స్టార్ డం తెచ్చిన ఆ సినిమా జనవరి 7న భారీ రేంజ్ లో రీ రిలీజ్ చేస్తున్నారు. మరి రీ రిలీజ్ టైం లో ఏ.ఎం రత్నం మంచి లాభాలు పొందాడు. ఎమ్మెస్ రాజు కూడా అదే రేంజ్ ప్రాఫిట్స్ అందుకుంటాడా లేదా అన్నది చూడాలి.

ఖుషి ఇచ్చిన ఊపు చూసి సూపర్ స్టార్ ఫ్యాన్స్ కూడా ఒక్కడు సినిమాను భారీగా చూడాలని ఫిక్స్ అయ్యారు. మరి మహేష్ ఒక్కడు ఖుషి రీ రిలీజ్ రికార్డులను బ్రేక్ చేస్తుందా లేదా అన్నది చూడాలి. ఒక్కడు సినిమా చూసి ఇలాంటి సినిమా తీయాలని అనుకున్న దర్శకులు, నిర్మాతలు ఎంతోమంది ఉన్నారు.

త్రివిక్రమ్ కూడా ఒక ఇంటర్వ్యూలో ఒక్కడు సినిమాలో తనకు హై ఇచ్చిన మూమెంట్స్ గురించి చెప్పుకొచ్చారంటే ఆ సినిమా ఎంత స్పెషల్ అన్నది చెప్పొచ్చు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే ఖుషి సినిమాలో హీరోయిన్ భూమిక కాగా.. జనవరి 7న రీ రిలీజ్ అవుతున్న ఒక్కడు సినిమాలో కూడా భూమికనే కథానాయిక. మహేష్ భూమిక జోడీ కూడా ఈ సినిమాలో హైలెట్ గా ఉంటుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.