Begin typing your search above and press return to search.

డిజిటల్ బాషాలో బ్రాండింగ్ కామెడీ

By:  Tupaki Desk   |   4 March 2017 12:15 PM GMT
డిజిటల్ బాషాలో బ్రాండింగ్ కామెడీ
X
సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన క్లాసిక్ మూవీ బాషా ఇప్పుడు రీ రిలీజ్ అయింది. డిజిటల్ ఫార్మాట్ లో మళ్లీ సిద్ధం చేసి థియేటర్లలోకి తీసుకొచ్చేశారు మేకర్స్. డిజిటల్ వెర్షన్ ను ప్లే చేసే సామర్ధ్యం ఉన్న ప్రతీ చోటా ఈ పిక్చర్ ను ప్రదర్శిస్తున్నారు. జనాల నుంచి కూడా అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.

అయితే.. ఇప్పటి సినిమాల్లో ముఖ్యంగా స్టార్స్ మూవీస్ లో ఇన్ ఫిలిం బ్రాండింగ్ సూపర్ కాన్సెప్ట్. కానీ బాషా ఒరిజినల్ గా రిలీజ్ అయిన సంవత్సరం 1995. అప్పుడు లేని కొన్ని హంగులను ఇప్పుడు డిజిటల్ వెర్షన్ బాషాలో చేర్చారు. వీటిలో రజినీకాంత్ నడిపే ఆటోపై ఓలా లోగోను ప్రింట్ చేశారు. ఇది సూపర్బ్ గా క్లిక్ అయిందని చెప్పాలి. ఎందుకంటే ఆ రేంజ్ లో దేశవ్యాప్తంగా ఇప్పుడు ఓలా హాట్ టాపిక్ అయింది. కాకపోతే.. నెగిటివ్ గా అనుకోండి.

ఈ దెబ్బకి నార్త్ లో రజినీకాంత్ పై పిచ్చ జోకులు పేలుతున్నాయి. రజినీకాంత్ ఆటో నడిపితే.. ఓలా ఆటో ఎక్కడికెళ్లిందో చూశారా అంటూ జోకులేస్తున్నారు. అఫ్ కోర్స్.. వీటిని రజినీ ఫ్యాన్స్ కూడా బాగా ఎంజాయ్ చేసేస్తున్నారు. ఈ ఫీట్ కేవలం రజినీకి తప్ప వేరెవరికీ సాధ్యం కాదని చెప్పేస్తున్నారు కూడా.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/