Begin typing your search above and press return to search.
ఆఫ్టర్ గ్యాప్ .... దర్శకులొస్తున్నారు
By: Tupaki Desk | 27 Feb 2020 6:45 AM GMTఈ ఏడాది టాలీవుడ్ లో కొందరు దర్శకులకు చాలా స్పెషల్ . అవును మూడేళ్ళ పైనే షూటింగ్ కి దూరమైన దర్శకులు ఈ ఏడాది మళ్ళీ మెగా ఫోన్ పట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. బొమ్మరిల్లు భాస్కర్ నుండి తెలుగు సినిమా వచ్చి చాలా ఏళ్లయింది. అప్పుదేప్పుడు ఒంగోలు గిత్త తీసి ఆ తర్వాత కనుమరుగయ్యాడు. మధ్యలో ఓ తమిళ్ సినిమా మాత్రమే చేసాడు భాస్కర్. ఎట్టకేలకు ఈ ఏడాది అఖిల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. మళ్ళీ ఓ బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో తన మేజిక్ చూపించాలని ఆరాటపడుతున్నాడు.
ఇక 'బ్రహ్మోత్సవం' తర్వాత యాక్షన్ అనే పదానికి దూరంగా ఉండిపోయాడు శ్రీకాంత్ అడ్డాల. బాక్సాఫీస్ దగ్గర సినిమా కలెక్షన్స్ రాబట్టలేక చతికిల పడటం , భారీ ఎత్తున సోషల్ మీడియాలో ట్రోలింగ్ అవ్వడంతో నిర్మాతలు , హీరోలు శ్రీకాంత్ అడ్డాల ను పక్కన పెట్టారు. దీంతో కొన్నేళ్ళు ఫోకస్ లో లేకుండా పోయాడు. ఫైనల్ గా వెంకటేష్ పిలిచి అసురన్ రీమేక్ ఛాన్స్ ఇవ్వడంతో 'బ్రహ్మోత్సవం' ని మర్చిపోయేలా 'నారప్ప' తో గ్రాండ్ హిట్ కొట్టి మళ్ళీ డైరెక్టర్ గా దూసుకెళ్ళాలని చూస్తున్నాడు.
దాదాపు మూడేళ్ళు గ్యాప్ తీసుకున్న గోపీచంద్ మలినేని కూడా రవితేజ క్రాక్ సినిమాతో ఈ ఇయర్ ప్రేక్షకులను పలకరించనున్నాడు. జెట్ స్పీడ్ లో సినిమాను ఫినిష్ చేసి మే 8న మళ్ళీ రవితేజతో కలిసి ఓ సూపర్ హిట్ అందుకోవాలని భావిస్తున్నాడు. సో ఇలా ఈ ముగ్గురు డైరెక్టర్స్ తమకొచ్చిన గ్యాప్ ప్రేక్షకులు మర్చిపోయేలా ఓ హిట్ అందుకొని మళ్ళీ గ్యాప్ లేకుండా సినిమాలు చేయాలని డిసైడ్ అయ్యారు. మరి వీరి గ్యాప్ మర్చిపోయేలా ఈ మూడు సినిమాలతో ప్రేక్షకులు ఎంటర్టైన్ అవుతారా చూడాలి.