Begin typing your search above and press return to search.
ఫొటో టాక్ :కరోనా నుండి విముక్తి పొందిన హీరోయిన్
By: Tupaki Desk | 23 March 2020 4:00 PM GMTప్రపంచ వ్యాప్తంగా జనాలను భయకంపితులను చేస్తున్న కరోనా వైరస్ తో సెలబ్రెటీలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలువురు హాలీవుడ్ స్టార్స్ కరోనా బారిన పడ్డ విషయం తెల్సిందే. జేమ్స్ బాండ్ హీరోయిన్ ఓల్గా కురెలెంకోకు కరోనా పాజిటివ్ అని కొన్ని రోజుల క్రితం వెళ్లడయ్యింది. కరోనా పాజిటివ్ అని తెలిసిన వెంటనే ఆమె పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యి ప్రత్యేకంగా వైధ్యుల సమక్షంలో ట్రీట్ మెంట్ తీసుకుంది.
రెండు వారాల పాటు పూర్తిగా ఆమె ఐసోషలేషన్ లో ఉంది. ఆ సమయంలో ఆమె పిల్లలను కూడా చూడకుండా ఉందట. ఎట్టకేలకు ఆమె పూర్తిగా కరోనా విముక్తి అయ్యిందట. ఈ విషయాన్ని స్వయంగా ఆమె చెప్పుకొచ్చింది. తన కొడుకును ఎత్తుకుని ఉన్న ఫొటోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం కొడుకు ఆనంద క్షణాలను గడుపుతున్నట్లుగా ఆమె పేర్కొంది.
కరోనాను ఎదుర్కొన్న సమయంలో ఆమె అనుభవాలను సోషల్ మీడియా ద్వారా నెటిజన్స్ తో షేర్ చేసుకుంది. మొదటి వారం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విపరీతమైన జ్వరం ఇంకా తలనొప్పితో బాధపడ్డాను. ఆ తర్వాత వారంలో ఎక్కువగా దగ్గు వచ్చేది. చాలా త్వరగా అలసి పోయేదాన్ని. రెండవ వారం ముగిసేప్పటికి దగ్గు పూర్తిగా తగ్గింది. ప్రస్తుతం ఎలాంటి అనారోగ్యం నాకు లేదని చెప్పుకొచ్చింది.