Begin typing your search above and press return to search.

ఆర్ఆర్ఆర్‌ - ఎన్టీఆర్‌ ల గురించి ఒలివియా ఏమన్నదంటే..!

By:  Tupaki Desk   |   7 April 2022 2:30 AM GMT
ఆర్ఆర్ఆర్‌ - ఎన్టీఆర్‌ ల గురించి ఒలివియా ఏమన్నదంటే..!
X
ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్‌ కు జోడీ గా ఒలివియా మోరిస్‌ నటించిన విషయం తెల్సిందే. ఇంగ్లీష్ బ్యూటీ అయిన ఒలివియా ఈ సినిమా షూటింగ్‌ కోసం హైదరాబాద్‌ కు 20 రోజులు వచ్చింది. ఆ సమయంలో చాలా కంగారు పడ్డట్లుగా చెప్పుకొచ్చింది. షూటింగ్‌ ప్రతి రోజు కూడా భయం వేసేదని.. ఆ సమయంలో ఎన్టీఆర్‌ తో మాట్లాడటం.. ఆయన నవ్వుతో నా లో ఉన్న భయం అంతా పోయేదంటూ ఒలివియా చెప్పుకొచ్చారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఎన్టీఆర్‌ ను సింగిల్‌ టేక్‌ ఆర్టిస్ట్‌ అంటూ చెప్పుకొచ్చిన ఒలివియా ఆయనతో వర్క్ చేస్తున్న సమయంలో చాలా విషయాలను నేర్చుకోవచ్చు అన్నట్లుగా చెప్పింది. నర్వస్ గా ఉన్న సమయంలో ఆయన చిరు నవ్వు చూసి చాలా వరకు రిలాక్స్ అయ్యేదాన్ని అంటూ ఒలివియా పేర్కొంది.

ఎన్టీఆర్ తో ఎక్కువ సమయం స్క్రీన్‌ స్పేస్‌ ను కలిగి ఉన్న ఒలివియా పాత్రకు అద్బుతంగా సెట్‌ అయ్యింది. జెన్నీ పాత్ర ను ఆమె తప్ప మరెవ్వరు కూడా చేయలేక పోయే వారు అనేది చాలా మంది అభిప్రాయం. చిత్ర యూనిట్‌ సభ్యులు ముఖ్యంగా చిత్ర దర్శకుడు అయిన రాజమౌళి కూడా అదే ఉద్దేశ్యంతో ఉండేవాడు. ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమాలో ఒలివియా యొక్క పాత్ర సినిమాకు ప్రథాన ఆకర్షణ అనడంలో సందేహం లేదు.

ఒలివియా ఇంకా రాజమౌళి గురించి మాట్లాడుతూ అమేజింగ్ డైరెక్టర్ అంటూ వ్యాఖ్యలు చేసింది. ఆయనతో వర్క్‌ చేయడం ను కూడా గొప్ప గౌరవంగా చెప్పుకొచ్చింది. రాజమౌళి మరియు ఎన్టీఆర్ లతో వర్క్ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్లుగా ఒలివియా ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. సినిమాలో ఆమె పాత్ర ను జనాలు మర్చిపోలేక పోతున్నారు.

రామ్‌ చరణ్‌ కు జోడీగా నటించిన ఆలియా భట్‌ కంటే కూడా అధికంగా స్క్రీన్ స్పేస్ ను ఒలివియా దక్కించుకుంది. ఫస్ట్‌ హాఫ్ మరియు సెకండ్‌ హాఫ్ లో కూడా ఈమె కనిపించడంతో ప్రేక్షకులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ఆలియా భట్‌ అభిమానులు ఆ విషయం లో తీవ్రంగా అసంతృప్తిని కూడా వ్యక్తం చేశారు. ఒలివియా కు ఇచ్చిన ప్రాముఖ్యత మా హీరోయిన్ కు ఇవ్వలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఒలివియాకు దక్కిన స్క్రీన్ స్పేస్‌ ను యూజ్‌ చేసుకుని ఆకట్టుకుంది.