Begin typing your search above and press return to search.

#RRR కోసం ఆగ‌లేనంటూ..!

By:  Tupaki Desk   |   3 Jan 2020 6:36 AM GMT
#RRR కోసం ఆగ‌లేనంటూ..!
X
స్వాతంత్య్ర పోరాటానికి ముందు ఇద్ద‌రు వీరుల క‌థ‌ను తెర‌పై ఆవిష్క‌రిస్తున్నారు ఎస్.ఎస్.రాజమౌళి. ఆర్.ఆర్.ఆర్ అనేది టైటిల్. ఇందులో ఏపీకి చెందిన మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజుగా చ‌ర‌ణ్‌.. నైజాంకి చెందిన గిరిజ‌న వీరుడు కొమురం భీమ్ పాత్ర‌లో ఎన్టీఆర్ న‌టిస్తున్నారు. జూలై 30న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇప్ప‌టికే 80శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. బ్యాలెన్స్ షూటింగ్ చేస్తున్నారు. మ‌రోవైపు నిర్మాణానంత‌ర ప‌నులు సాగుతున్నాయి. యంగ్ య‌మ ఎన్టీఆర్ - ఒలీవియా సీన్స్ ని జ‌క్క‌న్న తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఈ చిత్రంలో బ్రిటీష్ నటి ఒలీవియా స్టేజీ ఆర్టిస్టు అన్న సంగ‌తి తెలిసిందే. ఆర్.ఆర్.ఆర్ చిత్రంలో జెన్నిఫ‌ర్ అనే పాత్ర‌ లో న‌టిస్తోంది. అయితే త‌ను తార‌క్ అభిమానుల‌కు నిరంత‌రం సామాజిక మాధ్య‌మాల్లో ట‌చ్ లోనే ఉంటోంది. 2020 న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా ఆర్.ఆర్.ఆర్ అధికారిక ట్విట్ట‌ర్ కి ఒలీవియా రీట్వీట్ చేసింది. ``హ్యాపీ న్యూ ఇయ‌ర్.. ఆర్.ఆర్.ఆర్ 2020లో రిలీజ‌వుతోంది. న‌మ్మ‌లేనంత ఎగ్జ‌యిటింగ్ గా ఉన్నాను`` అని తెలిపింది. ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి దీనికి అద్భుత స్పంద‌న వ‌చ్చింది. ఒలీవియా కు ఏకంగా 10వేల లైక్స్.. 2వేల రీట్వీట్లు చేశారు. అంటే స్పంద‌న ఎలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు.