Begin typing your search above and press return to search.
జనవరి 10న కీరవాణి ముంచెత్తుతాడు
By: Tupaki Desk | 25 Dec 2016 10:27 AM GMTసంక్రాంతి సినిమాల ఆడియోల సంగతి తేలిపోయింది. ఆ తర్వాత రాబోయే భారీ సినిమాలు కూడా ఆడియో వేడుకలకు రెడీ అయిపోతున్నాయి. ఫిబ్రవరి 10న రిలీజయ్యే అక్కినేని నాగార్జున సినిమా ‘ఓం నమో వేంకటేశాయ’ విడుదలకు నెల రోజుల ముందే ఆడియో వేడుకను పూర్తి చేసుకోబోతుండటం విశేషం. ఈ సినిమా ఆడియో తేదీని ట్విట్టర్లో నాగార్జున ప్రకటించాడు. ఈ రోజు క్రిస్మస్ సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ.. ‘ఓం నమో వేంకటేశాయ’ ఆడియో వేడుకను జనవరి 10న నిర్వహించనున్నట్లు ప్రకటించాడు. నిన్నే విడుదలైన ‘ఓం నమో..’ టీజర్ అందరినీ ఆకట్టుకుంది. అన్నమయ్య.. శ్రీరామదాసు.. తరహాలోనే ప్రేక్షకుల మనసులు గెలిచేలా కనిపించింది.
పై రెండు సినిమాల ఆడియోలు ఎంత పెద్ద విజయం సాధించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ సినిమాలకు కీరవాణి అందించిన సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఆధ్యాత్మిక చిత్రాలంటే కీరవాణి ఎంతో మనసుపెట్టి పాటలు చేస్తాడు. గత కొన్నేళ్లలో ‘బాహుబలి’ మినహా ఆయన్నుంచి చెప్పుకోదగ్గ ఆడియోలు రాలేదు. ‘ఓం నమో వేంకటేశాయ’తో కీరవాణి మళ్లీ తన ప్రత్యేకతను చాటుకుంటాడని భావిస్తున్నారు. ఈ సినిమాలో పదికి పైగా పాటలుంటాయట. ఆడియో అద్భుతంగా వచ్చిందని టాక్. ఎస్పీ బాలు సహా చాలామంది సీనియర్ గాయకులతో పాటలు పాడించాడట కీరవాణి. మరి ఈసారి కీరవాణి నుంచి ఎలాంటి ఆడియో వస్తుందో చూద్దాం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/