Begin typing your search above and press return to search.

OM ట్రైల‌ర్: దేశం కోసం తండ్రి కోసం డేర్ డెవిల్ అడ్వెంచ‌ర్

By:  Tupaki Desk   |   11 Jun 2022 3:44 AM GMT
OM ట్రైల‌ర్: దేశం కోసం తండ్రి కోసం డేర్ డెవిల్ అడ్వెంచ‌ర్
X
'ఆషిఖి 2' లాంటి ప్రేమ‌క‌థా చిత్రంతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా యువ‌త‌రంలో ఫాలోయింగ్ సంపాదించుకున్న చాక్లెట్ బోయ్ ఆదిత్య రాయ్ క‌పూర్ ఇప్పుడు పూర్తిగా బీస్ట్ మోడ్ లోకి మారాడు. అత‌డు త‌దుప‌రి ఫ‌స్ట్ బ్ల‌డ్ తర‌హా భారీ యాక్ష‌న్ మూవీలో న‌టించాడు. OM: The Battle Within అనేది టైటిల్. తాజాగా ట్రైల‌ర్ విడుద‌లైంది ఇందులో ఆదిత్య రాయ్ కపూర్ హై-ఆక్టేన్ యాక్షన్ స‌న్నివేశాల్లో అద‌ర‌గొడుతున్నాడు. జాతీయ మిష‌న్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ మూవీలో అత‌డి వ్యక్తిగత మిషన్ ఏమిట‌న్న‌ది ఉత్కంఠ‌ను పెంచుతోంది.

ఆదిత్య రాయ్ కపూర్ తన దేశం కోసం తన తండ్రి కోసం కూడా పోరాడే దేశ భక్తుడిగా క‌నిపిస్తున్నాడు. ఈ చిత్రంలో సంజన సంఘి- అశుతోష్ రానా- జాకీ ష్రాఫ్- ప్రాచీ షా -ప్రకాష్ రాజ్ తదితరులు నటించారు. కపిల్ వర్మ దర్శకత్వం వహించారు. ఈ యాక్షన్-ప్యాక్డ్ డ్రామాలో ఊపిరాడ‌నివ్వ‌ని భావోద్వేగాలు మ‌రో హైలైట్. ట్రైలర్ లో ప్రాచీ షా కొడుకును పోగొట్టుకున్న దుఃఖంలో క‌నిపిస్తుంది.

ఒక చిన్నారి జ్ఞాప‌క‌శ‌క్తిని కోల్పోయి విజువ‌ల్ లో క‌నిపిస్తాడు. జాకీ ష్రాఫ్ పాత్ర ప‌రిచ‌యంలో ట్విస్టు.. అతను అత్యంత రహస్య అణు ప్రాజెక్ట్ పై వివరాలను వెల్లడించే తీరు ఉత్కంఠ పెంచుతుంది. అత‌డిని ఇంత‌లోనే దేశద్రోహి అంటూ కాప్ అరెస్ట్ చేస్తున్న దృశ్యాలు ..అంత‌లోనే ఆర్మీ బలగాలలో అత్యంత సమర్ధుడైన కమాండోగా ఆదిత్య ఇంట్ర‌డ‌క్ష‌న్ ఆస‌క్తిని క‌లిగిస్తాయి.

అతను చిన్నతనంలో జ్ఞాపకశక్తిని కోల్పోయిన అదే పిల్లవాడు అని అర్థ‌మ‌వుతుంది. ఆదిత్య జాకీ కొడుకు. యువ‌కుడయ్యాక‌ శిక్షణ పొందిన అధికారిగా దేశం కోసం పోరాడడమే కాకుండా తన తండ్రి గౌరవాన్ని కూడా కాపాడాలనుకునే ఎన‌ర్జిటిక్ హీ మ్యాన్ గా క‌నిపిస్తాడు.

ఆదిత్య రాయ్ కపూర్ చాలా సాహసోపేతమైన దూకుడైన‌ పాత్రలో కనిపిస్తున్నాడు. సినిమా ఆద్యంతం డేర్ డెవిల్ విన్యాసాలతో ర‌క్తి క‌ట్టిస్తూ మెషీన్ గ‌న్ తో దుమ్ము దులిపేస్తున్నాడు. ఒక అధికారిగా సంజన సంఘీ గ్లింప్స్ ఆక‌ట్టుకున్నాయి. దిల్ బేచారాతో తెరంగేట్రం చేసిన ఈ బ్యూటీ మ‌రోసారి చ‌క్క‌ని పాత్ర‌లో క‌నిపించ‌నుంది.

అశుతోష్ రానా- ప్రకాష్ రాజ్ - జాకీ ష్రాఫ్ లాంటి భారీ తారాగణం అద‌నపు అసెట్. జీ స్టూడియోస్ - అహ్మద్ ఖాన్ నిర్మించిన 'ఓం -ది బ్యాటిల్ వితిన్' జూలై 1న సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామాగా OM పాపుల‌రైంది. ఆదిత్య రాయ్ కపూర్ వ‌న్ మ్యాన్ షో తెర‌పై ఏ మేర‌కు ఆక‌ట్టుకుంటుందో చూడాలి.