Begin typing your search above and press return to search.
సంక్రాంతికి ఆ సినిమా లేదా?
By: Tupaki Desk | 4 Oct 2016 5:30 PM GMTఈ రోజుల్లో ఎంత పెద్ద సినిమా అయినా.. ముందు ప్రకటించిన తేదీకే రిలీజవుతుందన్న గ్యారెంటీ లేదు. ఈ ఏడాది వచ్చిన చాలా పెద్ద సినిమాలకు సంబంధించి.. ముందు ఓ రిలీజ్ డేట్ ప్రకటించారు. ఆ తర్వాత మార్చారు. ‘జనతా గ్యారేజ్’ కూడా అలా డేట్ మారిన సినిమానే. తర్వాతి పెద్ద సినిమా ‘ధృవ’కు కూడా మార్పు తప్పలేదు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది సంక్రాంతికి షెడ్యూల్ అయిన నాలుగు సినిమాల్లో ఏవి అనుకున్న ప్రకారం వస్తాయి.. ఏవి వాయిదా పడతాయని అంతా ఆసక్తిగా చూస్తున్నారు. ఐతే గత వారం రోజుల వ్యవధిలో రెండు ప్రెస్టీజియస్ ప్రాజెక్టులకు సంబంధించి కన్ఫర్మేషన్ వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ మూవీ ‘ఖైదీ నెంబర్ 150’ ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్రాంతికే విడుదలవుతుందని దాని నిర్మాత రామ్ చరణ్ ప్రకటిస్తే.. బాలయ్య 100వ సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ కూడా సంక్రాంతికే అని ఆ చిత్ర యూనిట్ వర్గాలు తెలిపాయి. మరోవైపు దిల్ రాజు కూడా తన ‘శతమానం భవతి’ సంక్రాంతికే అంటున్నాడు.
ఎటొచ్చీ అక్కినేని నాగార్జున సినిమా ‘ఓం నమో వెంకటేశాయ’ విషయంలోనే సందేహాలున్నాయి. ఇంతకుముందు సంక్రాంతి రిలీజ్ అని గట్టిగా చెబుతూ వచ్చారు కానీ.. ఇప్పుడా మాట ఎత్తట్లేదు. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ - గ్రాఫిక్స్‌కు చాలా ప్రాధాన్యం ఉందని.. అవి పక్కా క్వాలిటీతో ఉండేలా చూస్తున్నామని.. ఆ పని పూర్తయ్యాక కానీ రిలీజ్ విషయంలో తేల్చుకోలేమని చెప్పాడు నాగ్. మరోవైపు ఖైదీ నెంబర్ 150, గౌతమీపుత్ర శాతకర్ణిల మీద అంచనాలు మామూలుగా లేవు. వాటితో పోలిస్తే భక్తి రస చిత్రం అయిన ‘ఓం నమో వెంకటేశాయ’ మీద అంత హైప్ లేదు. మామూలుగా రిలీజైతే ఈ సినిమాకు మంచి స్పందనే ఉండొచ్చు కానీ.. ఇలా మంచి హైప్ ఉన్న సినిమాల మధ్య పోటీకి దిగితే ఇబ్బంది తప్పదు. అందుకే ‘ఓం నమో వెంకటేశాయ’ను సంక్రాంతికి రిలీజ్ చేసే విషయంలో సందేహంగానే ఉన్నట్లు తెలుస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/