Begin typing your search above and press return to search.

ఓం నమో వెంకటేశాయ.. 47 కోట్లు వచ్చేశాయ్

By:  Tupaki Desk   |   30 Jan 2017 7:57 AM GMT
ఓం నమో వెంకటేశాయ.. 47 కోట్లు వచ్చేశాయ్
X
ఓ భక్తి చిత్రానికి తెలుగు నాట రూ.47 కోట్ల బిజినెస్ జరిగిందంటే ఆశ్చర్యపోవాల్సిందే. అక్కినేని నాగార్జున-రాఘవేంద్రరావుల కాంబినేషన్లో తెరకెక్కిన ‘ఓం నమో వెంకటేశాయ’ ఈ ఘనత సాధించింది. ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ రూ.47.25 కోట్లకు చేరడం విశేషం. భక్తి చిత్రాల్లో ఇది ఒక రికార్డు. అన్నమయ్య.. శ్రీరామదాసు లాంటి సినిమాల తర్వాత నాగ్-కే ఆర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా కావడంతో ఈ సినిమాపై బయ్యర్లు చాలా నమ్మకమే పెట్టుకున్నారు. చాలా క్యాల్కులేటెడ్‌ గా సినిమాలు కొనే అగ్ర నిర్మాత దిల్ రాజు సైతం నైజాం ఏరియాకు రూ.9 కోట్లకు ‘ఓం నమో వెంకటేశాయ’ హక్కులు తీసుకోవడం విశేషం.

సీడెడ్లో రూ.4 కోట్లు.. వైజాగ్ లో రూ.2.9 కోట్లు పలికిన ‘ఓం నమో వెంకటేశాయ’ హక్కులు.. రెండు గోదావరి జిల్లాలకు కలిపి రూ.3.62 కోట్లకు అమ్ముడయ్యాయి. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.25 కోట్ల దాకా బిజినెస్ చేసింది ఈ సినిమా. కర్ణాటక హక్కులు రూ.2.7 కోట్లు పలికాయి. ఓవర్సీస్ రైట్స్ రూ.5.5 కోట్లకు తీసుకున్నారు. మొత్తంగా థియేట్రికల్ రైట్స్ రూ.34 కోట్ల దాకా అమ్ముడయ్యాయి. పబ్లిసిటీ ఖర్చులతో కలిపితే ఈ సినిమా రూ.35 కోట్ల దాకా వసూలు చేయాల్సి ఉంటుంది. ఈ చిత్ర శాటిలైట్ హక్కుల్ని అనూహ్యంగా రూ.12 కోట్లకు ఈటీవీ కొనుగోలు చేయడం తెలిసిందే. ఆడియో హక్కులు కూడా కలిపితే ‘ఓం నమో వెంకటేశాయ’ లెక్క రూ.47.25 కోట్లు. ఫిబ్రవరి 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/