Begin typing your search above and press return to search.

65 ఏళ్ల వయసులో ఆయనకు విడాకులు

By:  Tupaki Desk   |   10 Feb 2016 3:30 PM GMT
65 ఏళ్ల వయసులో ఆయనకు విడాకులు
X
బాలీవుడ్ విలక్షణ నటుడు ఓంపురి 65 ఏళ్ల వయసులో చట్టపరంగా విడిపోయి ఆశ్చర్యపరిచారు. ఓంపురికి, ఆయన భార్య నందితకు కోర్టు 'జ్యుడీషియల్ సెపరేషన్' మంజూరు చేసింది. దీని ప్రకారం వాళ్లిద్దరూ చట్ట ప్రకారం భార్యాభర్తలుగానే ఉంటారు గానీ.. విడివిడిగా ఉండాలి. ఒకరి వ్యవహారాల్లో మరొకరు జోక్యం చేసుకోకూడదు. కొడుకు ఇషాన్ (18) బాగోగులను మాత్రం ఇద్దరూ చూసుకుంటారు.

26 ఏళ్ల కిందట పెళ్లి చేసుకున్న ఓంపురి, నందిత కొన్నేళ్లుగా విడిగా ఉంటున్నారు. ఇటీవలే తమకు విడాకులు కావాలంటూ కోర్టు మెట్లెక్కారు కూడా. తర్వాత ఇద్దరూ విడాకుల విషయంలో వెనక్కి తగ్గి జ్యుడీషియల్ సెపరేషన్ కోరుకున్నారు. దీనికి అంగీకరించిన కోర్టు.. ఒకవేళ మళ్లీ వీళ్లు తిరిగి ఎప్పుడు కలవాలన్నా.. ఓ థర్డ్ పార్టీ సమక్షంలోనే ఆ తంతు పూర్తి చేసుకోవాల్సి ఉంటుందని షరతు విధించింది. ఓంపురి తన కొడుకుని కలుసుకునేందుకు కోర్టు వెసులుబాటు కల్పించింది. ఓంపురి, నందిత ఒకరిపై మరొకరు పెట్టిన కేసులను ఉపసంహరించుకున్నారు.

సుదీర్ఘ కాలం పాటు అన్యోన్యంగా జీవించిన ఓంపురి, నందితలకు ఓ పుస్తకం కారణంగా గొడవ రావడం విశేషం. 2009లో 'అన్ లైక్లీ హీరో.. ది స్టోరీ అఫ్ ఓంపురి' అంటూ ఆయన జీవిత చరిత్ర పుస్తకాన్ని నందిత రాసి విడుదల చేశారు. అందులో ఆయన తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి సంచలన విషయాలు వెల్లడించారు. అందులో శృంగార సంబంధిత అంశాలు కూడా ఉన్నాయి. దీనిపై భార్యాభర్తలిద్దరి మధ్య వివాదం మొదలైంది. చివరికది ఇద్దరూ విడిపోవడానికి కూడా దారితీసింది.