Begin typing your search above and press return to search.
ప్రభాస్ మూవీ బడ్జెట్ లో సగం వాటికే కేటాయిస్తారా...?
By: Tupaki Desk | 16 Oct 2020 1:30 AM GMTయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ లో నటించనున్న సంగతి తెలిసిందే. వైజయంతీ మూవీస్ బ్యానర్ లో అశ్వినీదత్ ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే నటించనుంది. ఇటీవలే ఈ భారీ ప్రాజెక్ట్ లో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కూడా చేరాడని మేకర్స్ ప్రకటించారు. ఇంతకముందు లెజండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాస్ ఈ చిత్రానికి మెంటర్ గా వ్యవహరించనున్నాడని తెలిపారు. అయితే త్వరలోనే మరికొంత మంది స్టార్స్.. స్టార్ టెక్నీషియన్స్ ఈ ప్రాజెక్టులోకి రాబోతున్నారని తెలుస్తోంది. సైన్స్ ఫిక్షన్ జోనర్ లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని భారతీయ భాషలతో పాటు పలు విదేశీ భాషల్లో కూడా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. అందుకే అత్యంత భారీ బడ్జెట్ తో స్టార్ క్యాస్టింగ్ తో అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందించాలని నిర్ణయించుకున్నారు.
పాన్ ఇంటర్నేషనల్ లెవల్లో రానున్న సినిమా కావడంతో ఇతర ఇండస్ట్రీల నుంచి స్టార్స్ ని తీసుకోనున్నారని తెలుస్తోంది. అన్ని భాషల వారినీ ఆకట్టుకోవాలి కాబట్టి ఆయా భాషలకు చెందిన స్టార్స్ కు చోటు కల్పించాలనుకుంటున్నారట. అలానే హాలీవుడ్ చిత్రాలకు పనిచేసే సాంకేతిక నిపుణులను కూడా తీసుకురానున్నారట. దాదాపు రూ.250 - 300 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందనున్న ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అప్డేట్స్ ఒక్కొక్కటిగా రివీల్ చేస్తూ మరింత హైప్ క్రియేట్ చేయడానికి మేకర్స్ ప్లాన్స్ చేసుకున్నారట. దీనిని బట్టి చూస్తే బడ్జెట్ లో సగ భాగం రెమ్యూనరేషన్స్ కే కేటాయించే అవకాశం ఉంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి రాబోతున్న ఈ సినిమా 2022లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.