Begin typing your search above and press return to search.
ప్రియాకు అంత సీన్ లేదన్న దర్శకుడు
By: Tupaki Desk | 10 March 2019 5:14 AM GMTఒక సినిమాతో పాపులర్ కావటం కామన్. ఒక పాటతో పాపులర్ కావటం కాస్తంత అరుదు. కానీ.. ఒక సీన్ తో అందరి నోట్లో నానటం అప్పుడప్పడు చూస్తుంటాం. కానీ.. ఒకే ఒక్క కనుసైగతో యావత్ దేశమంతా ఓవర్ నైట్ స్టార్ కావటం అందరికి సాధ్యం కాదు. కోట్లల్లో ఒకరిద్దరికి.. అది కూడా ఎప్పుడో ఒక్కసారి కానీ సాధ్యం కాదు. అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు ప్రియావారియర్.
ఈ మలయాళ కుట్టి కనుసైగకు యావత్ దేశం ఫ్లాట్ అయిపోయింది. ఒక పాటలో కన్నుగీటిన ఆమె.. కోట్లాది మంది కుర్రకారుకు నిద్ర లేకుండా చేసిందని చెప్పాలి. ఒరు ఆధార్ లవ్ మూవీలోని ఒక పాటకు ఆమె కన్నుగీతి చేసిన సీన్ సోషల్ మీడియాలో వైరల్ కావటం.. దానిపై దేశ వ్యాప్తంగా భారీ చర్చ జరగటంతో ప్రియా ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు. మరింతటి క్రేజ్ నను ఆ సినిమా నిర్మాత క్యాష్ చేసుకోకుండా ఉంటారా?
తొలుత అనుకున్న దాని ప్రకారం ప్రియా వారియర్ ది చాలా చిన్న రోల్ మాత్రమేనట. ఆ విషయాన్ని ఎవరో చెబితే అంత ప్రాధాన్యత లభించేది కాదు. కానీ.. ఆ సినిమా దర్శకుడు రివీల్ చేస్తూ.. సినిమాలో ప్రియా రోల్ చాలా చిన్నదని.. కానీ కన్నుగీటటంతో వచ్చిన క్రేజ్ నేపథ్యంలో ఆమె పాత్రను పెంచాలంటూ నిర్మాత ఒత్తిడి చేయటంతో ఆమె పాత్రను పెంచినట్లుగా చెప్పారు.
మొదట్లో ఆమెది సెకండ్ రోల్ అని.. తర్వాత మాత్రం ప్రియాను లీడ్ రోల్ గా చూపిస్తూ తెరకెక్కించినట్లుగా ఒరు ఆధార్ లవ్ మూవీ దర్శకుడు ఒమర్ లులు. మలయాళంతో పాటు తెలుగులో రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడిన సంగతి తెలిసిందే. ముందుగా రాసుకున్న స్క్రిప్ట్ కి.. తర్వాతకు సంబంధం లేదని.. ఆమె కన్నుగీట సంచలనం కావటంతో చిత్ర నిర్మాతలు ప్రియానే లీడ్ రోల్ లో ఉండేలా మార్పులు చేయాలని కోరారని.. అందుకే చేయాల్సి వచ్చిందన్నారు.