Begin typing your search above and press return to search.
ఇంక ఫోకస్ పవర్ స్టార్ పైనే
By: Tupaki Desk | 15 May 2018 5:04 AM GMTఈ ఏడాది ప్రేమికుల దినోత్సవానికి ముందు ప్రియా ప్రకాష్ వారియర్ అంటే చాలామందికి తెలియదు. లవర్స్ డే నాడు మళయాళ మూవీ ఒరు అడార్ లవ్ లో మాణిక్య మలరా పాటలోని ఓ సీన్ లో అబ్బాయి వైపు కన్నుకొడుతూ కనిపించింది. అంతే.. ఆ పాటలోని అబ్బాయితోపాటు దేశంలోని కుర్రాళ్లంతా ప్రియ ప్రకాష్ కు పడిపోయారు.
అనుకోని విధంగా వచ్చిన తన మూవీకి వచ్చిన పాపులారిటీ చూసి ఒరు అడార్ లవ్ డైరెక్టర్ ఒమర్ లులూ ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. కన్నుకొట్టుడు పిల్లను పరిచయం చేస్తున్న డైరెక్టర్ కావడంతో ఇప్పుడు అందరూ ఒమర్ లులూ ఏం చేస్తున్నాడా అని ఆసక్తిగా చూస్తున్నారు. ప్రస్తుతం ఒరు అడార్ లవ్ షూటింగ్ దాదాపుగా ఓ కొలిక్కి వచ్చింది. దాంతో డైరెక్టర్ తన తరవాత సినిమా కోసం కూడా రెడీ అయిపోయాడు. నెక్ట్స్ డైరెక్ట్ చేయబోయే మూవీకి టైటిల్ కూడా డిసైడ్ అయిపోయాడు. పవర్ స్టార్ టైటిల్ తో సినిమా తీయబోతున్నానంటూ ఒమర్ లులూ ఫేస్ బుక్ లో రివీల్ చేశారు. ఈ టైటిల్ ను రిజిస్టర్ కూడా చేసేశామని చెప్పుకొచ్చాడు.
ఒరు అడార్ లవ్ సెప్టెంబర్ లో థియేటర్లకు రానుంది. ముందు ఈమూవీని మళయాళంలో మాత్రమే రిలీజ్ చేద్దామని అనుకున్నారు. ప్రియా ప్రకాష్ కు వచ్చిన పాపులారిటీతో తమిళం తెలుగు హిందీలోనూ రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ రిలీజ్ కాగానే పవర్ స్టార్ గా ఎవరిని చూపించేదీ ఒమర్ లులూ అనౌన్స్ చేసే అవకాశముంది.