Begin typing your search above and press return to search.
రాజు గారి గదిని వదలనంటున్న డైరెక్టర్...?
By: Tupaki Desk | 27 Aug 2020 12:30 PM GMTబుల్లితెరపై యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఓంకార్.. వెండితెరపై దర్శకుడి అవతారమెత్తిన సంగతి తెలిసిందే. కోనేరు హవీష్ హీరోగా 'జీనియస్' అనే సినిమా తెరకెక్కించాడు ఓంకార్. ఆ తర్వాత ఓక్ ఎంటర్టైనెంట్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి హారర్ కామెడీ జోనర్ లో 'రాజు గారి గది' అనే చిత్రాన్ని రూపొందించాడు. పూర్ణ - అశ్విన్ బాబు - ధన్య బాలకృష్ణన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలో 'రాజు గారి గది' చిత్రానికి సీక్వెల్ గా 'రాజు గారి గది 2'ని తీసాడు. 'కింగ్' నాగార్జున - అక్కినేని సమంత - సీరత్ కపూర్ - అశ్విన్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. అందుకే ఈ సిరీస్ కొనసాగింపుగా 'రాజు గారి గది 3' చిత్రాన్ని రూపొందించాడు ఓంకార్. అశ్విన్ బాబు - అవికా గోర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అంతగా ప్రభావం చూపలేకపోయింది. అయినా సరే 'రాజు గారి గది'ని వదిలి రాలేనంటున్నాడు డైరెక్టర్ ఓంకార్.
కాగా, 'రాజు గారి గది' హిట్ ఫార్ములాను రిపీట్ చేసే ఉద్దేశ్యంతో ఓంకార్ ఇప్పుడు ఈ సిరీస్ లో నాలుగో చిత్రం చేయడానికి సన్నాహకాలు చేస్తున్నాడట. అయితే ఈ చిత్రాన్ని డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేసే విధంగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారితో ఒప్పందం కుదుర్చుకున్నారట. అందుకే ఓక్ ఎంటర్టైనెంట్ తో కలిసి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ''రాజు గారి గది 4'' ప్రాజెక్ట్ ని నిర్మించనున్నారట. ఏదేమైనా యాంకర్ కమ్ డైరెక్టర్ ఓంకార్ మాత్రం యాక్టర్ - డ్యాన్స్ మాస్టర్ - డైరెక్టర్ రాఘవ లారెన్స్ ని ఫాలో అవుతున్నట్లు అర్థం అవుతోంది. లారెన్స్ హారర్ కామెడీ జోనర్ లో 'ముని' 'ముని 2 - కాంచన' 'కాంచన 2' 'కాంచన 3' అనే నాలుగు చిత్రాలను డైరెక్ట్ చేసి సక్సెస్ సాధించారు. అంతేకాకుండా 'కాంచన' సినిమాని హిందీలో అక్షయ్ కుమార్ - కియారా అద్వానీ కాంబినేషన్ లో 'లక్ష్మీబాంబ్' పేరుతో రీమేక్ చేశాడు. ఇప్పుడు లారెన్స్ బాటలోనే ఓంకార్ కూడా నడుస్తున్నట్లు అర్థం అవుతోంది. మరి ఓంకార్ ''రాజు గారి గది 4'' తో సక్సెస్ సాధించి ఈ సిరీస్ ని కొనసాగిస్తాడేమో చూడాలి.