Begin typing your search above and press return to search.
స్టార్ ఒప్పుకుంటే సగం బడ్జెట్లో సినిమా-ఓంకార్
By: Tupaki Desk | 30 Oct 2015 6:35 AM GMTబుల్లితెరపై యాంకర్ గా పాపులరై.. ఆ తర్వాత వెండితెర దర్శకుడిగా మారిన వాడు ఓంకార్. కానీ దర్శకుడిగా అతడి తొలి సినిమా ‘జీనియస్’ చేదు అనుభవాన్ని మిగిల్చింది. అయినప్పటికీ నిరాశ చెందకుండా ట్రెండుకు తగ్గట్లు ‘రాజు గారి గది’ అనే హార్రర్ కామెడీ తీసి.. తనేంటో నిరూపించుకున్నాడు. చాలా తక్కువ బడ్జెట్లో తెరకెక్కిన ఈ సినిమా పెట్టుబడికి మూడు రెట్లు వసూళ్లు సాధించబోతోందని అంచనా. ఈ ఊపులో తన తర్వాతి సినిమాకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు ఓంకార్. పెద్ద హీరోకు తగ్గ ఎమోషనల్ కథ తన దగ్గర ఉందని.. ఎవరైనా స్టార్ ఒప్పుకుంటే మామూలుగా పెద్ద సినిమాలు తెరకెక్కే బడ్జెట్లో సగం ఖర్చుతో మంచి సినిమా తీస్తానని అంటున్నాడు ఓంకార్.
‘‘రాజుగారి గది సినిమాకు రూ.3 కోట్ల బడ్జెట్ అవుతుందనుకున్నాను. మాటీవీ అధినేత నిమ్మగడ్డ ప్రసాద్ ను కలిస్తే శాటిలైట్ రైట్స్ కింద ఆయన రూ.1.5 కోట్లిచ్చారు. ఇంకొంచెం డబ్బులు సమకూర్చుకుని సినిమా మొదలుపెట్టా. అప్పట్లో సినీ కార్మికుల సమ్మె వల్ల సినిమా ఆలస్యమైంది. మళ్లీ సినిమా మొదలుపెడితే కార్మికుల జీతాలు డబుల్ అయ్యాయి. బడ్జెట్ రూ.40 లక్షలు పెరిగింది. ఐతే బడ్జెట్లో రూ.40 లక్షలు తగ్గేలా స్క్రిప్టు మార్చుకున్నా. నేను అనుకున్న బడ్జెట్లోనే మంచి క్వాలిటీతో సినిమా తీశా. ఇప్పుడీ సినిమా రూ.10 కోట్ల దాకా వసూలు చేస్తోంది. పెద్ద సినిమాల్ని కూడా తక్కువ బడ్జెట్లోనే తీయొచ్చు. నా దగ్గర ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన మంచి కమర్షియల్ కథ ఉంది. అది పెద్ద హీరోలకు బాగా సూటవుతుంది. ఎవరైనా స్టార్ హీరో ఒప్పుకుంటే తన వరకు పారితోషకం ఏమీ తగ్గించకుండా మామూలుగా పెద్ద సినిమాలకు అయ్యే బడ్జెట్ లో సగం ఖర్చుతో సినిమా పూర్తి చేస్తా’’ అని చెప్పాడు ఓంకార్. మరి ఓంకార్ తో సినిమాకు ఏ హీరో ముందుకొస్తాడు.